ఈ మద్య బాలీవుడ్ లో సెలబ్రెటీల కన్నా వారి పిల్లలే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు.  సోషల్ మీడియాలో వారు చేస్తున్న అల్లరి..ఫోటో షూట్స్, వీడియోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.  ఇక బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్- గౌరీల కూతురు సుహానా ఖాన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ అమ్మడు ఏం చేసినా..మీడియా దాన్ని పెద్దగా ఫోకస్ చేసి చూపిస్తుంది.  ఆ మద్య బికినీ వేసుకున్న ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి..రీసెంట్ గా క్రికెట్ మ్యాచ్ లో తన తండ్రితో వచ్చిన సుహానా ఫోటోలు తెగ హల్ చల్ చేశాయి. 

సుహానా వేసుకున్న షూ విషయం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిందంటే ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ అలాంటిది. ఒక రకంగా చెప్పాలంటే..సుహానా ఖాన్ యూత్ హార్ట్‌త్రోబ్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త్వ‌ర‌లో వెండితెర ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని కూడా చెబుతున్నారు. 17 ఏళ్ల సుహానా ప్రస్తుతం ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్నది.  సుహానా ఖాన్ తన ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఆడుకుంటున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

లండన్ లో తన ఫ్రెండ్స్ తో మ్యూజికల్ చైర్ ఆటాడుతూ సుహానా ఉత్సాహంగా గడిపింది. సుహానాతో పాటు విదేశీ అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇందులో వివిధ రకాల దేశాలకి చెందిన అమ్మాయిలు కనిపిస్తున్నారు. ఇంగ్లీష్‌ అమ్మాయిలతో సుహానా స్నేహం బాగానే ఉందని ఈ వీడియోని బట్టి అర్ధమవుతుంది. ఆ మధ్య జయాబచ్చన్ బర్త్ డే వేడుకలతో పాటు కోల్‌క‌తాలో ఆర్సీబీ, కేకేఆర్ టీంల మ‌ధ్య జరిగిన ల్ మ్యాచ్ లోను సుహానా సందడి చేసింది.  సుహానా త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: