తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు తన సంగీతంతోనే సూపర్ హిట్ చేయించిన ఘన ఎం ఎం కీరవాణికి దక్కుతుంది.  కీరవాణి సంగీతం అంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అనే టాక్ వచ్చింది.  భక్తి, రొమాంటి, మాస్ ఇలా ఎలాంటి సంగీతమైనా ఆయన అద్భుతంగా పలికించగలరు.  బాహుబలి, బాహుబలి 2 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతం అందించి జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందారు.  ఆయన సోదరి గాయనిగాను .. సంగీత దర్శకురాలిగాను ఎం.ఎం. శ్రీలేఖకి మంచి గుర్తింపు వుంది. 
Image result for singer srilekha mm kirawani
ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. నాకు చిన్నప్పటి నుంచి కాస్త గారాభం ఎక్కువే చేశారు..అందుకే మొండి వైఖరిగా ప్రవర్తించేదాన్ని..ఏ పనైతే వద్దంటారో .. అదే పని చేసే దానిని. నాకు చాలా పొగరని చాలామంది అంటూ వుంటారు .. అందులో నిజం లేకపోలేదు కూడా. చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా నన్ను కొడితే వెంటనే తిరిగి ఒకటి ఇచ్చేస్తుంటాను. ఈ విషయంలో ఎదుటివాళ్లు ఎవరనేది కూడా చూడను. ఒకసారి స్కూల్లో ఒక టీచర్ నన్ను కొట్టింది .. అంతే నేను తిరిగి కొట్టేశాను. అంతే మా నాన్నగారు..అబ్బో ఇలా అయితే చదువు అబ్బదు..సంగీతం  నేర్పించాలనుకున్నారు.
Image result for singer srilekha mm kirawani
అందుకోసం ఇంటికి ఒక మాస్టారును పిలిపించారు. రెండు రోజుల తరువాత తాను చెప్పిన పాఠాన్ని మాస్టారు  అప్పగించమన్నారు. నేను పాఠం అప్పగించినా కొడతారా అని బెత్తాన్ని తిప్పి తిప్పి మరీ ఆయనను కొట్టాను  అని శ్రీలేఖ చెప్పుకొచ్చారు.  శ్రీలేఖ తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో 80 సినిమాల వరకూ శ్రీలేఖ సంగీతాన్ని సమకూర్చారు. సినిమా పాటలు .. ప్రైవేట్ పాటలు కలుపుకుని నాలుగు వేల పాటలు వరకూ పాడారు.     చిన్నప్పుడు 'శంకరాభరణం' సినిమా చూసిన తరువాత, శంకరశాస్త్రి గారే ఆ పాటలు పాడారని అనుకున్నాను. ఆ పాటలు పాడినది బాలూగారు అని నాన్నగారు చెప్పారు. బాలూ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్లమని నేను పట్టుపట్టడంతో మా నాన్నగారు తీసుకెళ్లారు.

మా అమ్మాయి బాగా పాడుతుందండి' అని మా నాన్నగారు చెప్పగానే, 'ఏదమ్మా ఒక పాట పాడు' అని బాలూగారు అన్నారు. 'శంకరా బరము .. ' అంటూ రాగం తీశాను. వెంటనే ఆయన 'ఆపేయ్' అన్నారు. 'మీ అమ్మాయి గొంతు కాకి అరిచినట్టుగా ఉందండి' అన్నారు.  కొంత కాలం తర్వాత 'ఆయనకి ఇద్దరు' సినిమాలో 'అందాలమ్మో అందాలు .. ' అనే డ్యూయెట్ ను బాలూగారి తో కలిసి పాడాను. నేను రికార్డింగ్ స్టూడియో వద్ద ఉండగా..బాలసుబ్రమణ్యం వచ్చారు. 'నువ్వేంటి ఇక్కడ?' అన్నారు. పాడించడానికి తీసుకొచ్చాను అని 'కోటి' గారు చెప్పారు. 'ఎందుకయ్యా ఇలాంటి పనులు చేస్తారూ .. తర్వాత నా పాట విని..అబ్బో ‘కాకి ..కోకిల అయ్యిందే’ అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: