బాలీవుడ్లో శృంగార తారగా దూసుకుపోతున్న బ్యూటీ సన్నీలియాన్ సౌత్‌లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ ఈ భామకు మంచి డిమాండ్ ఉంది. అయితే సౌత్‌లో సినిమాలు చేయడానికి సన్నీలియాన్ పలు కండీషన్లు పెడుతోందట. ఆ వివరాలిలా వున్నాయి.
తాజాగా ఓ టాలీవుడ్ నిర్మాత ఆమెను కలిసి తన సినిమాలో నటించమని అడిగితే సన్నీ అదిరిపోయే కండీషన్లు చెప్పిందట. ఈ భామ పెట్టిన కండీషన్లు నిర్మాతకు పెద్ద షాక్నిచ్చాయట. తాను ఏదైనా సినిమాకు సంతకం చేయాలి అంటే ముందుగా సదరు దర్శక నిర్మాతలు తన నియమ నిబంధనలకు ఒప్పుకోవాల్సిందేనట.
తన వద్దకు బౌండ్ స్క్రిప్ట్‌తో వస్తేనే సన్నీలియాన్ సినిమా చేస్తుందట. సెట్స్ కెళ్లాక ఒక్క సీన్‌ను మార్చినా కుదరదు. స్క్రిప్టు పరంగా మార్పులు చేయడానికి వీళ్లేదని సన్నీలియాన్ చెప్పిందట. ఈ కండీషన్లు ఒప్పుకుంటేనే తాను సినిమా చేస్తానని సన్నీలియాన్ టాలీవుడ్ నిర్మాతకు నిర్మొహమాటంగా చెప్పిందని తెలిసింది.
నిజానికి చాలా కాలంగా దక్షిణాది నిర్మాతల క్రమశిక్షణారాహిత్యాన్ని ఈ భామ తనదైన శైలిలో ప్రశ్నిస్తోంది. బౌండ్ స్క్రిప్టు లేకుండానే మన నిర్మాతలు సినిమాలు తీస్తారని కాస్త తీవ్రంగానే విమర్శించింది. సహజంగానే యూ.ఎస్ నుండి వచ్చిన భామ గనుక ఆమెకు స్క్రిప్ట్, మరియు డైరెక్షన్ మీద ఒకింత అనుభవం ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు.