టాలీవుడ్ ప్రేక్షకులకు అమీజాక్సన్ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఆ మద్య విక్రమ్ నటించిన ‘ఐ’ మూవీలో నటించింది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ 2.ఓలో ‘యంతరలోకపు సుందరి’గా సందడి చేసిన ఈ భామ త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కనుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ ఫోటో ద్వారా వెల్లడించింది.
బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనయటోతో జాంబియాలో ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే వీరి పెళ్లికు ముందే అమీజాక్సన్ ప్రెగ్నెన్సీ అన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి కాకుండానే గర్భవతి అయిన ఈ భామ తనకు కాబోయే భర్తతో కలిసి తిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బేబీ బంప్‌తో స్పెషల్ ఫొటో షూట్ చేయించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమెకు ఏడవ నెల అని తెలిసింది. అమీజాక్సన్ తన ప్రియుడు జార్జ్‌ను త్వరలో పెళ్లి చేసుకోనుంది.
కొంతకాలంగా ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్న వీరు చివరికి పెళ్లి చేసుకోబోతున్నారు. డెవివరీలోపే పెళ్లికి రంగం సిద్ధం చేస్తున్నారట అమీజాక్సన్ కుటుంబ సభ్యులు. ఇటలీలో ఆమె వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇంకా పెళ్లికి డేట్ ఫిక్స్ కాలేదని తెలిసింది.