తమిళనాడు , ఆంధ్ర హైవే పై 1990 లో ఒక వేశ్య జీవితం లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా తమిళం లో అబ్దుల్ మజిత్ దర్శకత్వం లో రూపొందించిన టార్చ్ లైట్ చిత్రాన్ని , శ్రీమతి 21 ఎఫ్ పేరిట తెలుగులోకి అనువదించారు . శృంగార వస్తువే ప్రధాన కథాంశంగా రూపొందిన ఈ సినిమా లో సదా లీడ్ రోల్ లో నటించింది . శ్రీమతి 21 ఎఫ్ సినిమా ట్రైలర్ ను ఇటీవల చిత్ర దర్శక , నిర్మాతలు రిలీజ్ చేశారు . చిత్ర ట్రైలర్ లోని సన్నివేశం లో సదా చెప్పిన డైలాగ్ కుర్రకారు ను రెచ్చగొట్టే విధంగా ఉంది .
ఒక విటుడితో వేశ్య పాత్రధారి అయినా సదా జాకెట్ నన్నే విప్పమంటావా .. నువ్వు విప్పుతావా అంటూ కళ్ళతోనే శృంగారాన్ని ఒలికించింది . గతం లో వేశ్య జీవితగాధలను ఆధారంగా చేసుకుని వచ్చిన పలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాల్నే సాధించడమే కాకుండా క్రిటిక్స్ ప్రశంసలను కూడా అందుకున్నాయి . శ్రీమతి 21 ఎఫ్ కూడా అదే కోవ సినిమా అని దర్శక , నిర్మాతలు చెబుతున్నారు . ఈ చిత్రాన్ని నవంబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు .
జయం సినిమా తో టాలీవుడ్ కు పరిచయమైన సదా ఆ తరువాత, టాలీవుడ్ , కోలీవుడ్ పరిశ్రమ లో అగ్ర హీరోల సరసన నటించింది . విక్రమ్ హీరో నటించిన అపరిచితుడు చిత్రం లో హీరోయిన్ గా నటించిన సదా నటనకు మంచి మార్కులే పడ్డాయి . అయితే ఆ తరువాత సదా కు పెద్దగా అవకాశాలు లభించక , టీవీ షోలలో పాల్గొంటోంది .