టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ యంగ్ అండ్ ఎనర్టిటిక్ హీరో, అలాగే బాక్సాపీస్ ని దుమ్ము దులిపే హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ నెంబర్ వన్ సక్సెస్ రేటు ఉన్న హీరోగా కెరీర్ ని లీడ్ చేస్తున్నాడు. అల్లుఅర్జున్ మూవీలు మినిమం గ్యారెంటీ స్థాయి నుండి, బాక్సాపీస్ రికార్డ్ లను షేక్ చేసే స్థాయికి చేరుకున్నాయి. ఇదిలా ఉంటే అల్లుఅర్జున్ కి ఫేక్ బుక్ లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ లో సోషియల్ నెట్ వర్కింగ్ ఫాలోవర్స్ లో అల్లుఅర్జున్ మొదటి వరులో ఉన్నాడు. తను తన మూవీలకి సంబంధించిన డిటైల్స్ ని, అలాగే పర్సనల్ లైఫ్ లోని మెమరబుల్ మూమెంట్స్ ని తన ఫేస్ బుక్ లో పెట్టి, అభిమానులని అలరిస్తాడు. ఆ విధంగా తాజాగా తన కొడుకు అల్లు అయాన్ కి సంబంధించిన ఒక ఫోటోని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషియల్ నెట్ వర్కింగ్ లోనే కాకుండా, అభిమానుల్లోనూ ఆనందాన్ని నింపుతుంది. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ముద్దుల తనయుడి పేరు అల్లు అయాన్ అప్పుడే మెగా ఫ్యాన్స్ అభిమానాన్ని పొందగలుగుతున్నాడు. అల్లు అయాన్ ని చూడాలని అభిమానులతో పాటు మీడియా కూడా అయాన్ ని చూసేందుకు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ తన కొడుకు ఫోటోని నెట్ లో పెట్టడంతో అందరి దృష్టి ఇప్పుడు అల్లు అయాన్ మీదే ఉంది. అల్లు అర్జున్ ఈ ఫోటోని మెగాభిమానులకు స్పెషల్ గిఫ్ట్ గా విడుదల చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: