వలసదారులు అంటేనే పురుగులకంటే హీనంగా చూస్తున్నాడు..ట్రంప్..అందులోనూ భారతీయులు అంటే ట్రంప్ కి ముందుగానే ఎక్కడా లేని ఉక్రోషం వచ్చేస్తుంది కూడా..అయితే మొదటి నుంచీ వలసదారులపై వారి ఆశలపై నీళ్ళు చల్లుతూ వస్తున్నా ట్రంప్..తాజాగా మరోసారి హెచ్1బి వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో ట్రంప్ ఆడింది అంతా డ్రామా అని తేలిపోతోంది..అయితే అమెరికా ప్రభుత్వం. ఈ నిర్ణయం భారతీయ ఐటీ కంపెనీలపై, ఆ సంస్థల ఉద్యోగులపై ప్రభావం చూపించనుంది.

Image result for trump-administration-makes-h1b-visa-approval-tough-indian-firms-to-be-im
అమెరికా తెచ్చిన కొత్త పాలసీ ప్రకారం హెచ్‌1బీ వీసాల కోసం దరఖాస్తు చేసే ఐటీ కంపెనీలు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు అదనపు వివరాలు కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగుల అదనపు వివరాలు, వాటికి సంబంధించిన  ఆధారాలను కూడా సమర్పించాలని మార్గదర్శకాలు జారీ చేసింది..అయితే..కొత్త పాలసీ ప్రకారం..2019 ఆర్థిక సంవత్సరానికి గాను వచ్చే ఏప్రిల్‌ 2 నుంచి హెచ్‌1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుందని అయితే..కేవలం మూడేళ్ల కాలపరిమితితో మాత్రమే ఈ వీసాల జారి  ఉంటుందని స్పష్టం చేసింది.
Image result for trump-administration-makes-h1b-visa-approval-tough-indian-firms-to-be-im

వివిధ దేశాలలో ఉద్యోగులని అమెరికాలో నియమించుకోవడం కోసం ఉపయోగించే తాత్కాలిక వీసా హెచ్-1బి పై ట్రంప్ కొన్ని నిభందనలు సవరించారు...కేవలం అత్యుత్తమ స్కిల్స్ కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే నియమించుకోవడానికి అనుమతినిచ్చారు. కొత్త పాలసీలో దీనికి కొనసాగింపుగా.. సదరు ఉద్యోగుల నిర్దిష్టమైన క్వాలిఫైయింగ్ కు సంబంధించి అదనపు వివరాలను జోడించాల్సి ఉంటుంది...అంతేకాదు అదనపు సమాచారం లో చేసే పనికి సంభందించిన డాక్యుమెంట్స్‌తో పాటు..మార్కెటింగ్ అనాలిసిస్..కాస్ట్ బెనిఫిట్..ఫండింగ్ డాక్యమెంట్స్ వంటి ప్రతుల్ని జత చేసి చూపించాల్సి ఉంటుదని తెలిపారు..ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ప్రభావం భారత ఐటీ వ్యవస్థపై పడేలాఉందని అంటున్నారు. మరి ఏమేరకు భారత టెకీలకి ఇది డ్యామేజ్ అవుతుందనే భయం వారిలో ప్రస్తుతానికి అందోళన కలిగించేలా ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: