దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ముమాలుగానే  ఎక్కువ కాలుష్యం ఉండగా ఇక ఇప్పుడు ఆ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ఢిల్లీ ప్రజలందరూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఢిల్లీలో ఉన్న వాయు  కాలుష్యం కారణంగా తమ ఆరోగ్యం ఏమైపోతుందో  అంటూ బెంబేలెత్తిపోతున్నారు ఢిల్లీ వాసులు. అయితే ఢిల్లీ రాష్ట్రంలో వాయు కాలుష్యం కోరల్లో బతుకుతున్నారు ప్రజలు. ఇక రాష్ట్రంలో కాలుష్యం తీవ్రత ఎక్కువ అవడంతో ఆక్సిజన్ శాతం కూడా తగ్గింది. ఈ క్రమంలో పాఠశాలకు  కూడా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. రోడ్డుపై తిరిగే  వాహనాలకు కూడా  సరే బేసి సంఖ్య విధానాన్ని అమలు చేసింది. రాష్ట్రంలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించేందుకు  ప్రభుత్వ అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. 

 

 

 

 అయితే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో కాలుష్యంపై పార్లమెంటు ప్యానెల్  సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి బిజెపి ఎంపీ టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ డుమ్మ కొట్టారు. ఓవైపు రాష్ట్రంలో ఉన్న కాలుష్య తీవ్రత పై పార్లమెంట్ ఫ్యానల్ సమావేశం జరిగితే... దానికి గైర్హాజరైన బిజెపి ఎంపీ ఇండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మాత్రం భారత్-బంగ్లా  మధ్య జరిగిన మ్యాచ్ కి కామెంట్రీ ఇస్తూ కనబడ్డారు . 

 

 

 

 మాజీ క్రికెటర్ తో కలిసి ఆయన జిలెబీలు తింటున్న  ఫోటో వైరల్ అయిపోయింది. దీంతో ఈరోజు ఢిల్లీలో గౌతం గంభీర్ కనిపించడం లేదు అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి సమీపంలో కొన్ని చెట్లకు పలువురు ఈ పోస్టర్లను అతికించారు . ఈ ఫోటోలోని వ్యక్తిని మీరు ఎక్కడైనా చూసారా చివరిసారిగా ఇండోర్లో అతడు తన స్నేహితులతో కలిసి తింటూ కనిపించాడు. ఆ తర్వాత కనిపించలేదు. ఢిల్లీ మొత్తం ఆయన కోసం వెతుకుతోంది అంటూ పోస్టర్లలో రాసి ఉంది. ఈ పోస్టర్లు ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: