రెండున్నర ఏళ్లలోనే ఏపీలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు డేంజర్ జోన్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్నారు...అప్పుడు ఏదో జగన్ గాలిలో గెలిచేశారు గాని...ఆ తర్వాత వారు సొంతంగా నిలబడటంలో విఫలమవుతున్నట్లే కనిపిస్తున్నారు. వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలు ప్రజలకు సరిగ్గా అందుబాటులో లేక...ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే 50 మందిపైనే ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి..రాను రాను ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు రెడ్ అలెర్ట్ వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు..మామూలుగానే వెస్ట్ టీడీపీకి కంచుకోట..అలాంటప్పుడు వైసీపీ చాలా జాగ్రత్తగా పనిచేయాలి..మళ్ళీ టీడీపీకి పుంజుకునే అవకాశం ఇవ్వకూడదు...కానీ వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి చాలావరకు అవకాశం ఇచ్చినట్లే కనిపిస్తున్నారు.

వెస్ట్‌లో 13 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే...అయితే 13 మందిలో 7 గురు ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని తెలుస్తోంది...ఇక ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు డేంజర్ జోన్‌లోకి వచ్చేశారని తెలుస్తోంది. అలాగే డేంజర్ జోన్‌లోకి వచ్చిన వారిలో ఒక మంత్రి కూడా ఉండటం గమనార్హం.

ఏలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆళ్ళ నాని పరిస్తితి మెరుగ్గా ఉన్నట్లు కనిపించడం లేదు..ఆయనపై వ్యతిరేకత ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. అలాగే దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరీ సైతం డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. తక్కువ కాలంలోనే అబ్బయ్య ప్రజా వ్యతిరేకతని తెచ్చుకున్నారని చెప్పొచ్చు.

అటు తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పరిస్తితి కూడా పెద్దగా బాగోలేదని తెలుస్తోంది..ఈయనపై కూడా వ్యతిరేకత వస్తుందని తెలుస్తోంది. ఇక తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పరిస్తితి మరీ దారుణంగా ఉందని సమాచారం. ఇలా ఈ నలుగురు డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్తితి కూడా సరిగ్గా లేదని విశ్లేషణలు వస్తున్నాయి. మొత్తానికి..వెస్ట్‌లో వైసీపీ డేంజర్‌ జోన్‌లో ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: