శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డి శాంతి జగన్ పై అసహనం విషయంలో మొదటివరుసలో ఉన్నారట.. శ్రీకాకుళం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాలవలస రాజశేఖరం కుమార్తె అయిన రెడ్డి శాంతి పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేశారు. నిన్నగాక మొన్న పార్టీ లోకి వచ్చిన వారికి పెత్తనం ఇవ్వడం ఆమెకు నచ్చడం లేదట.. దాంతో జగన్ పై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారట ఆమె.. మంత్రి పదవి ఆశించిన రెడ్డి శాంతికి కనీసం నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదు. పార్టీ కోసం ఎంతో ఖర్చు చేసి.. అప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోయినా తాను ఎంతో కష్టపడ్డానని ఆమె వాపోతోన్న పరిస్థితి.