తెలంగాణ లో బీజేపీ బలపడడం పై కేసీఆర్ కొంత సీరియస్ గా ఉన్నారు.. రాబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలిచి తమ పై నమ్మకం ప్రజలకు ఏమాత్రం తగ్గలేదని నిరూపించాలని చూస్తున్నారు. బీజేపీ పార్టీ బలం ఒత్తి గాలిబుడగలే అని తేల్చేయాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. అందుకే అక్కడ స్వయంగా అయన రంగంలోకి దిగి ఎన్నికల బాధ్యతలు చూసుకోవాలని భావిస్తున్నారు.. కేటీఆర్ చేతులమీదుగా అంతా ఎక్జిక్యూట్ చేస్తున్నా సరే తాను కూడా అక్కడ ప్రజల్లో ఉంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అయన భావిస్తున్నారు.