మెగా కుటుంబం ఇపుడు సినిమాల్లో బిజీగా ఉంది. చిరంజీవి ప్రజరాజ్యం పార్టీ పెట్టి కొన్నాళ్ళు సీరియస్ గానే రాజ‌కీయాల్లో ఉన్నారు.  ఆ తరువాత మ‌ళ్లీ ఆయన ముఖానికి రంగు వేసుకుని సినిమాలకే అంకితం అయిపోయారు. ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. మెగా ఫ్యామిలీలో అంతటి చరిస్మా కలిగిన రాం చరణ్ సైతం రాజకీయాల్లోకి వస్తారా.. ఆయనలో  ఆ క్వాలిటీస్ ఉన్నాయని ఓ బిగ్ పొలిటికల్ స్టార్ చెప్పడం ఊహాగానాలను రేపుతోంది.


స్పీచ్ అదిరిందిట :


విషయం ఏంటంటే వినయ విధేయ రామ మూవీ ట్రైల రిలీజ్ ఫంక్షన్ నిన్న జరిగింది. ముఖ్య అతిధిగా వచ్చిన టీయారెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ రాం చరణ్ స్పీచ్ కి ఫిదా అయిపోయారు. చాలా బాగా మాట్లాడవ్ మిత్రమా అంటూ మా ఎన్నికల ప్రసంగాల కంటే కూడా నీ స్పీచ్ ఎంతో బాగుదని కితాబు ఇచ్చారు. అంతటితో ఆగకుండా రాజకీయాల్లో మంచి ఫ్యూచరుందని కూడా సభా వేదిక మీదనే అనేశారు. దానికి రాం చరణ్  ఒకింత షాకింగ్ గా ఇబ్బందిగా ముఖం పెట్టడంతో ఇపుడు కాదులే, ఆ టైం వచ్చినపుడు వస్తుందంటూ చెప్పడంతో చెర్రీ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.


బాబాయికి ప్రచారం :


నిజానికి చెర్రీ ఈ వేదిక మీద నుంచి కొంత పొలిటిక్స్ మిక్స్ చేస్తూ మాట్లాడారు. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రావడంతో రాం చరణ్ తమ ప్రసంగంలో ఒక చిన్న గ్లాస్ పెద్ద చరిత్ర స్త్రుష్టించబోతోందని చరణ్ అనడం ద్వారా  బాబాయ్ పవన్ కి, ఆయన పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించేశారు. మరి రానున్న రోజుల్లో చరణ్ తన బాబాయ్ పార్టీ తరఫున నిలబడి ఎన్నికల ప్రచారం గట్టిగా చేస్తారేమో చూడాలి. 

ఇప్పటికే నాగబాబు, ఆయన కుమారుడు వరుణ్ తేజ్ కూడా జనసేన పార్టీకి  భారీగా విరాళాలు ఇవ్వడంతో పాటు, జనసేనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. చూస్తూంటే మెగా క్యాంప్ మళ్ళీ పాలిటిక్స్ పై సీరియస్ గానే ద్రుష్టి పెడుతోదని అంటున్నారు. సరిగ్గా ఈ టైంలో కేటేయార్ చరణ్ ని ఉద్దేశించి చేసిన పొలిటికల్ ఎంట్రీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: