ప్రభుత్వ ఉద్యోగం.. చాలమంది యువకుల కల.. బాగా కష్టపడి చదివామంటే.. కష్టపడ్డామంటే.. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించామంటే.. లైఫ్ సెటిల్ అవుతుంది. భావన చాలామంది యువతలో కనిపిస్తోంది. అందుకే కోచింగ్ సెంటర్లు కుప్పులు తెప్పలుగా వస్తున్నాయి.

 

ప్రభుత్వాల నోటిఫికేషన్లు కూడా అందుకు అనుగుణంగానే ఉంటున్నాయి. నేటి యువ‌త చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, వారి ల‌క్ష్యం మాత్రం సంపాద‌న‌పైనే ఉండడం గ‌మ‌నార్హం. అయితే గతంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే.. ఓ బాధ్యత అన్న ఫీలింగ్ ఉండేది. ప్రజలకు సేవ చేసే ఓ చక్కటి అవకాశం అన్న భావన ఉండేది.

 

కొంత మంది అధికారులను ప్రజలకు జీవితాంతం గుర్తు పెట్టుకునేవారు. వారు ఎక్కడైనా కనిపిస్తే చాలు గౌరవంగా చూసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం ఎంచుకున్నారంటే.. సంపాద‌న‌కోస‌మేన‌ని ఓపెన్ అయిపోతున్నవారు చాలా మంది ఉన్నారు. స‌మాజం, బాధ్యత‌లు, నైతిక విలువ‌లు అనే మాట చాలా త‌క్కువ మంది నోటి వెంటే వింటున్నాము.

 

సంపాదనే సర్వస్వంగా బతుకుతున్నారు. అయితే అందరినీ ఆ గాటన కట్టకపోయినా ఎక్కువ మంది మార్గం ఇలాగే ఉంటోంది. కొందరు యువత మాత్రం ముందు తరం దూతల్లా ఉంటున్నారు. జనం కోసం పాటుపడే లక్షణాలు ఉన్నాయి. అయితే ఇలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు అన్నట్టు తయారైంది నేటి పరిస్థితి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: