స్థానిక సంస్థల ఎన్నికలు పోటీ చేసే విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఆందోళన ఉంది ఎన్నికల్లో పోటీ చేస్తే చేదు ఫలితాలు తప్పవేమో అన్న భయాందోళనలు చంద్రబాబులో ఇప్పటికే నెలకొనగా, చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ అండగా నిలబడే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఇప్పుడు పరోక్షంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయొద్దు అన్నట్లుగానే తన మీడియా ద్వారా కథనాలు ప్రచారం చేస్తున్నారు, ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, పోలీసులు, అధికారులు అధికార పార్టీకి వంత పాడే అవకాశం ఉందని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశాలు లేవని, ఇటువంటి సందర్భంలో ఈ ఎన్నికల్లో పోటీ చేసి డబ్బు పోగొట్టుకోవడం కంటే అసలు పోటీ చేయకుండా ఉండటమే మేలని అన్నట్లుగా రాధాకృష్ణ తన కథల ద్వారా ఆ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నారు.  


ఈ ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కొనేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటామని, కార్యకర్తలకు నాయకులు ధైర్యంగా ఫోన్ చేయాలంటూ నెంబర్ కూడా ఇస్తున్నారు. ఈ మాటలకు టిడిపి క్యాడర్ లో కొంత ఉత్సాహం కనిపిస్తున్నా, ఇది అంతగా ఉపయోగపడుతుందని చెప్పలేని పరిస్థితి ఉందనే అభిప్రాయాలు అందరిలోనూ నెలకొన్నాయి. ఇదే విషయమై ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ ఓ వ్యాసాన్ని రాసుకొచ్చారు. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా.. అలా గెలిచిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతారని ముందుగానే టిడిపి నాయకులను రాధాకృష్ణ హెచ్చరించారు. 


తమిళనాడులో జయలలిత, ఏపీలో కాంగ్రెస్ పార్టీ, స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలేదని, తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాయని, ఇప్పుడు అదే మార్గాన్ని వీరు అవలంభించారని రాధాకృష్ణ సూచించారు. తనకు అత్యంత సన్నిహితులైన రాధాకృష్ణ ఈ విధంగా చెప్పడంతో చంద్రబాబులో ఏమైనా మార్పు వస్తుందో, ఎన్నికల్లో పోటీ చేసే విషయమే వెనక్కి తగ్గుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: