ఏదైనా చిన్న అవకాశం దొరికితే చాలు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూ విమర్శలు చేస్తూ ఉంటారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. ఇక ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల వాయిదా నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాలు వాడివేడిగా జరుగుతున్న విషయం తెలిసిందే. అధికార పార్టీ కేవలం ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేయడమే కాదు అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అసంతృప్తితో ఉంటూ  విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  కేంద్రానికి రాసినట్టుగా ఓ లేఖ ప్రస్తుతం పెద్ద దుమారమే  రేపుతోంది. 

 

 

 అయితే తాజాగా ఈ లేఖపై స్పందించిన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకంగా ఆర్డినెన్స్  తెచ్చిన వైనాన్ని, తెనాలిలో వైసీపీ గుండాలు టిడిపి పార్టీ  అభ్యర్థి ఇంట్లో... అక్రమంగా మద్యం సీసాలు పెట్టినా విషయాలని  లేఖలో  ఎన్నికల కమిషనర్ ప్రస్తావించారు అంటూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వివరించారు. కేవలం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రమే కాదు... తాము కూడా ఇవే అంశాలను ఆరోపించాము  అంటూ ఈ సందర్భంగా తెలిపిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు... వైసీపీ పార్టీ చేసిన అరాచకాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ సాక్ష్యం కూడా తమ వద్ద  ఉంది అంటూ తెలిపారు. 

 

 

 వైసీపీ పార్టీ నేతలే అక్రమంగా టిడిపి అభ్యర్థి ఇంటి పైన మద్యం సీసాలను పెట్టి... మళ్లీ ఏం తెలియనట్టుగా వాళ్లే పోలీసులు అక్కడికి పంపించారని...  ఇక పోలీసులు కూడా వైసీపీ నేతలు ఎక్కడ మద్యం సీసాలు పెట్టారో  అక్కడికి నేరుగా వెళ్లి మందు సీసాలు గుర్తించారు అంటూ ఆరోపించారు చంద్రబాబు నాయుడు. దీనికి సమాధానం చెప్పే ధైర్యం వైసీపీ పార్టీకి ఉందా..?  అంటూ ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు. సిగ్గు శరం ఉంటే దీనిపై మాట్లాడతారా..? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు,  వైసీపీ నేతలు అందరూ చేసిందంతా చేసి మళ్ళీ ఎదురుదాడికి దిగుతారా అంటూ  నిలదీశారు. కరోనా వైరస్  నియంత్రణలో భాగంగానే ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలను వాయిదా వేసింది అంటూ వ్యాఖ్యానించి చంద్రబాబు... కానీ ఎన్నికలను వాయిదా వేసినందుకు  ఎన్నికల కమిషనర్ భద్రతకే ముప్పు వాటిల్లింది అంటూ ఆరోపించారు. భద్రత ఉంటే తప్ప విధులు నిర్వహించలేను అని ఎన్నికల సంగం చెప్పే  తీవ్ర పరిస్థితి ప్రస్తుతం జగన్ సర్కారు తీరుకు అద్దంపడుతుంది అంటూ విమర్శించారు చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: