కరోనా.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి.. ఇది రోజురోజుకూ విస్తరిస్తోంది. చైనాలో ప్రాణం పోసుకున్న ఈ వైరస్ రాక్షసి ఇప్పుడు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకూ విస్తరించింది. చైనాలోనే ఇప్పటి వరకూ 3261 మందిని బలితీసుకున్న ఈ కరోనా.. ఇప్పుడు మిగిలిన దేశాల్లోనూ అంత కంటే భయంకరమైన గణాంకాలే నమోదు చేస్తోంది.

 

 

అయితే మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ కరోనా పరిస్థితి గురించి తాజా సమాచారం ఎలా తెలుసుకోవడం.. ఏ దేశంలో ఎన్నికేసులు ఉన్నాయో.. ఎంత మంది చనిపోయారో అన్న సమాచారం ఎలా తెలుసుకోవడం.. ఇందుకోసం ఓ వెబ్ సైట్ ప్రత్యేక ప్రయత్నం చేస్తోంది. www.worldometers.info అనే వెబ్ సైట్ కరోనాకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు లైవ్ లో అప్ డేట్ చేస్తూ అందిస్తోంది.

 

 

ప్రపంచంలో జనాభా పెరుగుదలను లైవ్ లో చూపించాలనే లక్ష్యంతో ఈ వెబ్ సైట్ ఏర్పాటైంది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో కరోనా వ్యాప్తి గణాంకాలను ఎప్పటికప్పుడు లైవ్ లో అప్ డేట్ చేస్తోంది. ఈ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే.. కరోనా వైరస్, పాపులేషన్ అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. కరోనా వైరస్ ఆప్షన్ క్లిక్ చేస్తే.. అసలు ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో ఎంత మంది కోలుకున్నారు. ఎంత మంది కరోనాతో చనిపోయారు అనే విషయాలు లైవ్ అప్ డేట్స్ ఉంటాయి.

 

 

అంతే కాదు.. దేశాల వారీగా కూడా ఈ వెబ్ సైట్ జాబితా రూపొందిస్తోంది. దేశం పేరు, ఎన్ని కేసులు నమోదయ్యాయి.. కొత్త కేసులు ఎన్ని.. ఆ దేశంలో ఇప్పటి వరకూ ఎంత మంది చనిపోయారు.. కొత్తగా ఎంత మంది చనిపోయారు.. మొత్తం ఎంత మంది కోలుకున్నారు.. యాక్టివ్ గా ఉన్న కేసులెన్ని.. క్రిటికల్ కేసులు ఎన్ని.. ఇలా.. కరోనాకు సంబంధించిన సమస్త సమాచారం ఇందులో ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. కరోనా విశ్వరూపం చూడాలంటే.. https://www.worldometers.info ఈ వెబ్ సైట్ చూడాల్సిందే.. మీరూ ట్రై చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: