ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సిఎం జగన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి కి మించిన విజేత గా ఆయన నిలిచారు అనేది వాస్తవం. తండ్రి పేరు తో పైకి వచ్చారు అనే అపవాద ను విపక్షాలు వేసినా సరే ఆయన ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేసినా సరే జగన్ మాత్రం ఎక్కడా కూడా భయపడకుండా రాజకీయం చేసారు అనేది వాస్తవం. ఏపీ రాజకీయాలలో వైఎస్ ఫ్యామిలీ కి ఉన్న పేరు ని ఆయన దాదాపుగా నిలబెట్టారు అనే చెప్పాలి. తండ్రి ని మించిన  తనయుడు అని సిఎం  గా జగన్ అనిపించుకున్నారు అనే చెప్పాలి. 

 

రాజకీయంగా వైసీపీ నేడు అత్యంత బలంగా ఉంది. సంక్షేమ కార్యక్రమాలను సిఎం జగన్ చాలా వేగంగా అమలు చేస్తున్నారు. తండ్రి ఇమేజ్ తో సిఎం అయ్యారు అని చాలా మంది విమర్శలు చేస్తున్నా సరే ఆయన మాత్రం తన ఇమేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలకు స్పష్టంగా తన పాలన తో చెప్తున్నారు. బలమైన రాజకీయ నేతగా ఉన్న చంద్రబాబు ని ఆయన ఎదుర్కొన్న తీరు ఆయన సాధించిన విజయం దేశానికే ఆదర్శంగా నిలిచింది అని చెప్పాలి. సిఎం గా జగన్ ఎవరికి భయపడే రకం కాదు. ఆయనను ఎదుర్కొనే సత్తా కూడా దాదాపుగా ఇప్పుడు ఎవరికి లేదు అనే చెప్పాలి. 

 

ఇప్పుడు జగన్ కి ఉన్న బలం గురించి చంద్రబాబు సహా చాలా మంది తక్కువ అంచనా వేస్తూనే ఉన్నారు. ఇక ఆయన రాజకీయం తండ్రిని మించి ఉంటుంది అనే విషయం చాలా సందర్భాల్లో వ్యక్తమైంది. తనను చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెట్టారో అన్నే ఇబ్బందులను జగన్ కూడా పెడుతున్నారు అనేది అర్ధమవుతుంది. వైఎస్ మాదిరిగా ఆయన సాఫ్ట్ కాదు అని చాలా మంది అంటారు జగన్ సిఎం అయ్యాక చాలా మందికి క్లారిటి  వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: