దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా వైరస్ గురించి, కరోనా వ్యాక్సిన్ గురించి అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో కరోనాకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా సోకకుండా ఉండాలంటే ప్రజలు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 
 
బయటకు వెళ్లే సమయంలో ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. సామాజిక దూరం పాటించడంతో పాటు చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉండటంతో అప్పటివరకు సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
ఉప్పుతో కరోనాను ఆరంభంలోనే నిరోధించవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపిస్తే ఉప్పుతో వాటిని నయం చేయవచ్చని వారు చెబుతున్నారు. edinburgh believe కు చెందిన శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం సముద్రపు ఉప్పు జలుబుతో బాధ పడేవారిలో యాంటీ వైరల్ లక్షణాలను తగ్గిస్తుందని తేలింది. ఉప్పునీటి ద్రావణంతో ముక్కును శుభ్రం చేస్తే వైరస్ లక్షణాలు తగ్గిపోవడాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
ఉప్పునీటితో కరోనాను నయం చేయవచ్చా....? చేయలేమా.....? అనే విషయాలను తెలుసుకోవడానికి మరికొన్ని ప్రయోగాలు చేస్తున్నట్టు ఉషర్ సంస్థ డైరెక్టర్ అజిజ్ షేక్ చెబుతున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప్పునీరు కరోనా వ్యాప్తిని తగ్గించగలదని తాము ఆశిస్తున్నామని అన్నారు. ప్రజలకు ఉప్పు, నీటిని ఉపయోగించే విధానం గురించి కొంత అవగాహన ఉంటే సరిపోతుందని చెప్పారు. మరోవైపు దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 17,000కు అటూఇటుగా కేసులు నమోదవుతూ ఉండటంతో కేంద్రం కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.        

మరింత సమాచారం తెలుసుకోండి: