గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలి అని పట్టుదలగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొంత మంది నేతలను తీసుకొచ్చే ప్రచారం చేయించడం ఆ పార్టీ పరువు తీసింది అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. ప్రధానంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి కొంత మంది నేతలను హైదరాబాద్ తీసుకొచ్చే ప్రచారం జరుగుతుంది. అందరూ కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రుల స్థానంలో ఉండి కూడా స్మ్రితి ఇరాని సహా కొంతమంది నేతలు మాట్లాడే మాటలు చాలా కామెడీగా ఉన్నాయి అనే భావన ప్రజల్లో ఉంది.

తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు అయిపోతే వాళ్ళు ఎక్కడుంటారో కూడా చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు వీళ్ళు హైదరాబాదు వచ్చి మేనిఫెస్టో విడుదల చేయడం ప్రచారం చేయడం చూస్తుంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అసలు వల్ల తెలంగాణకు ఏమైనా ఉపయోగం ఉందా అనే ప్రశ్నలు కూడా చాలామందిలో వినబడుతున్నాయి. ఒక పక్కన టిఆర్ఎస్ పార్టీలో కేవలం మంత్రి కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. అయినా సరే బిజెపి నేతలు మాత్రం చాలా మంది హైదరాబాదులో అడుగుపెట్టారు. దాదాపుగా 12మంది కేంద్ర మంత్రులు హైదరాబాదులో ప్రచారం చేయడం చూసి చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ప్రచారం చేస్తున్నారు. రేపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వీళ్ళు ప్రచారం చేయడం వల్ల టిఆర్ఎస్ పార్టీకి లాభమే కానీ నష్టం ఏమీ ఉండదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎంతసేపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజల్లో భారతీయ జనతా పార్టీ గుర్తింపు పొందుతుంది అని భావిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో శాంతి భద్రతల సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: