
అచ్చెన్నాయుడు కంటతడి వెనుక రహస్యం....?
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..
జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన
తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
పార్టీ కార్యకర్తలు, అభిమానులను చూసి కంటతడి పెట్టుకున్నారు. ఏపీలో
పంచాయతీ ఎన్నికల పోరులో భాగంగా మొదటి విడత
పంచాయతీ ఎన్నికలలో పోలింగ్ కొనసాగుతోంది. ఇక ఇదే రోజు అచ్చెన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడలో కూడా ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అక్కడ అచ్చెన్నాయుడు సతీమణి సర్పంచి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. భారీ బందోబస్తు మధ్య నిమ్మాడలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
జైలు నుంచి విడుదలైన తర్వాత అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు.
జగన్ సర్కారు కక్షసాధింపు చర్యలకు భయపడేది లేదని తేల్చిచెప్పారు.వైసిపి విధ్వంస విధానాలతోనే
విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోటలో
టిడిపి కార్యకర్త కాశీరాం బలవన్మరణానికి పాల్పడ్డారని
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.అధికార
పార్టీ అప్రజాస్వామిక విధానాలకు.. ఇంకా ఎంతమంది బలహీన వర్గాలవారు బలికావాలని నిలదీశారు. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన
వైసిపి నేతల దుశ్చర్యను ఆయన ఖండించారు.
వైసిపి నేతలు
పంచాయతీ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోలేక.. అడ్డదారులు తొక్కుతున్నారని అచ్చెన్న మండిపడ్డారు. కాశీరాం మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి
టిడిపి అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
పంచాయతీ ఎన్నికల్లో
వైసీపీ గెలవడానికి పోలీసులే కారణమని
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. తన స్వగ్రామం ఎప్పుడూ ఏకగ్రీవం అయ్యే
పంచాయతీ అని అలాంటి చోట వైసీసీ గెలిచిందంటేనే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఆడవాళ్లని చూడకుండా తన కుటుంబీకులపై పోలీసులు కేసులు బనాయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 90 శాతం పోలింగ్ అయ్యే తన గ్రామంలో పోలీసుల భయం కారణంగానే పోలింగ్ శాతం తగ్గిందని అచ్చెన్న ఆరోపించారు. ఎన్నికల్లో
వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు.
ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం
ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి.