దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజు రోజుకు రేటు పైకి కదులుతుంది. అయితే పెట్రోల్ ధరలు పెరగడం తో సామాన్యుడు బండిని నడపడం మానేసి బస్సు ప్రయాణాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మాత్రం నిత్యావసర వస్తువులు మరో వైపు గుండెల్లో భారాన్ని నింపుతుంది. మొన్నటి వరకు కరోనా కారణంగా ప్రజలు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఇప్పుడు మాత్రం వంట చేసుకోవాలంటే వంద ఆలోచిస్తున్నారు.


తిరుపతి, చిత్తూరు నగరాల తో పాటు వివిధ పట్టణాలకు మదనపల్లె, కుప్పం, అనంతపురం, కడపతో పాటు కర్ణాటక రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. ఇటీవల పెరిగిన ఇంధన ధరలతో వాహన యజమానులు అద్దెలు దాదాపు 50 శాతం వరకు పెంచారు. లారీ యజమానుల సంఘాలు అద్దెలు సవరించాయి. దూరం, బరువును బట్టి ఖరారు చేశారు. సాధారణం గా రైతులు బుట్టల రూపంలో కూరగాయాలను ఎగుమతి చేస్తారు. పలువురివి సేకరించి ట్రక్కుల్లో నగరాలకు, పట్టణాలకు తీసుకువస్తారు..


అలా ధరలు పెరిగి పోయాయి. పంటను కొనుగోలు చేసేందుకు వచ్చే ధరల కన్నా కూడా కూలీల ధరలు పెరిగిపోవడం తో రేట్లు పెరిగాయి.ఇంటి ఖర్చులు పెరిగిపోయాయి. సాధారణ కుటుంబానికి నెలకు కూరగాయలకే రూ.500 నుంచి రూ.1,000 వరకు అదనపు భారం పెరిగింది. ఇంకా వంటనూనెలు, గ్యాస్‌ ధరలు ఇటీవల భారీగానే పెరిగి పోయాయి. వీటి భారం మరో రూ.1,000 వరకు ఉంటోంది. మధ్య తరగతి కుటుంబం పై కనీసం అంటే రూ.2 వేలకు పై గానే భారం పెరిగింది. గత నెల తో పోలిస్తే ఈ నెల ఒకటో తేదీన ఎలా రేట్లు పెరగడం పై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యవసర వస్తువుల పై ధరల తగ్గింపు పై  ప్రభుత్వం ఆలోచించాలని తిరుపతి వాసులు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: