సినిమా రంగమైనా, రాజకీయాలయినా పవన్ కల్యాణ్ చుట్టూ లెక్కలేనన్ని పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ఆయన పొలిటికల్ కెరీర్ గురించి, వ్యగ్తిగత విషయాల గురించి ఎప్పుడు ఏ వార్త ఎక్కడ వచ్చినా సెస్సేషన్ కాక మానదు. ఇటీవల కాలంలో పవన్ యాక్టివిటీ కాస్త తగ్గడంతో మరోసారి ఆయనపై సరికొత్త రూపంలో ఫేక్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. మోదీ కేబినెట్ లోకి పవన్ ని తీసుకుంటున్నారని, ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని దాని సారాంశం.

కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో పవన్ పై కూడా ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కొన్ని ప్రముఖ న్యూస్ చానెల్స్ కూడా దీనిపై ఫోకస్ పెట్టాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా హైలెట్ చేయడంతో సగటు ప్రజలు కూడా ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేకపోయారు.

అసలింతకీ పవన్ కి మంత్రి పదవి ఎందుకిస్తారు..?
గతంలో కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో ఆదుకున్నందుకు, ప్రజారాజ్యాన్ని విలీనం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా చేసినందుకు చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి బహుమతిగా లభించింది. అయితే ప్రస్తుతం ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. వచ్చే ఏడాది జరగబోతున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం మంత్రి వర్గాన్ని విస్తరించాలనుకుంటోంది బీజేపీ. అసంతృప్తుల్ని బుజ్జగించి, ఆయా రాష్ట్రాల్లో పార్టీ ప్రతిష్ట పెంచేందుకు మోదీమాస్టర్ ప్లాన్ వేశారు. మరి ఈ ప్లాన్ లో పవన్ కి చోటెక్కడుంది. జనసేన పార్టీ అధినేతను తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చి, ఆ తర్వాత రాజ్యసభకు పంపిస్తారా..? ఇది నమ్మే వ్యవహారమేనా..? కానీ నమ్మకంగా ఓ వర్గం మీడియా ప్రచారం చేసే సరికి సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది.

రాష్ట్ర రాజకీయాలకు కూడా ప్రస్తుతం పవన్ టైమ్ కేటాయించలేని పరిస్థితి. వకీల్ సాబ్ తర్వాత ఆయన వరుసగా సినిమాలు కమిట్ అయ్యారు. షూటింగ్ స్టేజ్ లో ఉన్నవాటితోపాటు.. డిస్కషన్లో కూడా మరికొన్ని సబ్జెక్ట్ లు ఉన్నాయి. ఈ దశలో పవన్ కేంద్ర రాజకీయాలపై దృష్టిపెట్టగలరా. పోనీ పవన్ ని బీజేపీ పిలిచి మరీ పదవి ఇవ్వడానికి ఏదైనా బలమైన కారణం ఉందా. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది. ఏపీలో పవన్ అభిమానులకు గాలమేసేందుకు ఆయన్నే సీఎం అభ్యర్థిగా చాలామంది బీజేపీ నేతలు ప్రకటించేశారు కూడా. ఇప్పుడు కొత్తగా కేంద్రమంత్రి పదవి ఇవ్వడానికి మోదీ-షా అంత అమాయకులేం కాదని విశ్లేషకుల వాదన.

మరింత సమాచారం తెలుసుకోండి: