దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. తద్వారా ఏ మహిళ అయినా కోరిన చోట బస్సు ఆపడం వల్ల నేరాలు ఆపగలగొచ్చని భావిస్తోంది. అందులో భాగంగా ఎక్కడకోరితే అక్కడ బస్ ఆపే ప్రక్రియను వెలుగులోకి వచ్చింది. సాధారణంగా సాయంత్రం డ్యూటీలు ముగించుకొని ఇంటికొచ్చేసరికి రాత్రి 9నుండి10అయ్యే సందర్భాలున్నాయి. ఇలాంటప్పుడు డ్యూటీ చేసే ప్రాంతం నుండి బస్టాప్ కు నడుచుకుంటూ పోవడం లాంటి వాటిని గమనించింది ప్రభుత్వం. దీనివల్ల ప్రమాదం ఎదురయ్యే సంఘటనలు ఎదురుకావచ్చని భావించి చేయి ఎత్తితే బస్ ఆపే ప్రక్రియను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మహిళలు సురక్షితంగా ఇంటికి చేరవచ్చు.
నిర్భయ, అభయ లాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇటీవల దిశ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సదరు మహిళ ప్రమాదంలో ఉన్నప్పుడు ఆటోమెటిక్ గా దిశ యాప్ పోలీసులను, పేరెంట్స్ ను అలర్ట్ చేయడం లాంటివి చేస్తుంది. అలా ఉండటం వల్ల పోలీసులు అప్రమత్తమై..బాధితురాలిని కాపాడగలుగుతారు
నిర్భయ, అభయ లాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇటీవల దిశ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సదరు మహిళ ప్రమాదంలో ఉన్నప్పుడు ఆటోమెటిక్ గా దిశ యాప్ పోలీసులను, పేరెంట్స్ ను అలర్ట్ చేయడం లాంటివి చేస్తుంది. అలా ఉండటం వల్ల పోలీసులు అప్రమత్తమై..బాధితురాలిని కాపాడగలుగతారు. ఇటీవల స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగి దిశ యాప్ పై యువతులు, మహిళల్లో అవగాహన కలిగించారు. దీంతో యువతులు, మహిళలు దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. తమను తామే కాపాడుకుంటామని చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి