అంతేకాదు ఇక పార్టీలో కీలక నేతలుగా కొనసాగుతూ ఏ పదవిలో లేనటువంటి నేతలకు కూడా క్రమక్రమంగా కీలక పదవులు అప్ప చెబుతూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగారు లక్ష్మీపార్వతి. ముఖ్యంగా చంద్రబాబును ఆయన తనయుడు లోకేష్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంలో ఆమె ఎప్పుడూ ముందున్నారు. అయితే ఆ తర్వాత ఆమెకు కీలక పదవి దక్కుతుందని అనుకున్నారు. అయితే కొంత ఆలస్యం అయినప్పటికీ ఆమెకు తెలుగు అకాడమీ చైర్మన్ పదవి దక్కింది.
అయితే గత కొంత కాలం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి మాత్రం పట్టించుకోవడం లేదు అన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి కీలక పదవి దక్కింది. ఇటీవలే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసిపి లో ఎంతో పాపులర్ యువ నాయకుడు గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ని ఇవ్వని ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుని అప్పజెప్పింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి ఏపీ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ పదవిని ఇటీవలే ఏపీ ప్రభుత్వం అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే నందికొట్టుకురు నియోజకవర్గం ఇన్చార్జిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి