నాన్చొద్దు : పెండింగ్ ఫైల్ .. ఇదే మోడీ స్టైల్

మొద‌ట‌గా నాకొక డౌట్..మొద‌ట్లో వినిపించిన సందేహం..ఆంధ్రాభ‌వ‌న్ కు సంబంధించి రేగిన వివాదం. ఇది మాదంటే మాది అని రెండు తెలుగు రాష్ట్రాల పెద్ద‌లూ కొట్టుకున్నారు. ఆ త‌గువు తేలలేదు. పోనీ ఉమ్మ‌డి ఆస్తుల పంపకం పూర్త‌యిందా అంటే అదీ లేదు..ప్రాంతీయ ప్ర‌యోజ‌నాల కోసం పోరాడ‌డం అంత సులువు కాదు. కొంత అనుభ‌వ రాహిత్యం వెన్నాడుతుంది. అది జ‌గ‌న్ కు మైన‌స్ .. అనుభ‌వం ఉన్నా కొన్ని కార‌ణాలు,కేసులు ఉన్నాయి క‌నుక అడ‌గ‌లేని వైనం చంద్ర‌బాబుది కావొచ్చు. ఇలా నాయ‌కుల లో పార‌ద‌ర్శ‌క‌త లేని కార‌ణంగా కేంద్రం ఏ ప‌నీ చేయ‌దు. అన్నింటినీ చూస్తాం చేస్తాం అనే చెబుతోంది. ఒక్క లేఖ‌తో నిధులు తె ప్పించ‌గ‌ల స‌మ‌ర్థ‌త మ‌న నాయ‌కుల‌కు లేదు. అది త‌మిళ ముఖ్య‌మంత్రి జ‌య‌లలిత‌కే సాధ్యం. ఇప్పుడున్న సీఎం స్టాలిన్ కూడా ప్రాంతీయ ప్ర‌యోజ‌నాల‌పై మాట్లాడ‌గ‌ల‌రు. కానీ ఇబ్బంది ఎక్క‌డంటే మ‌న ముఖ్య‌మంత్రులు అస‌లు మాట్లాడ‌డ‌మే లేదు. ఒక‌వేళ మాట్లాడినా కేంద్రం నుంచి వచ్చే స్పంద‌న శూన్యం..స్పంద‌న ఉన్నా ఇదిగో చూద్దాం చేద్దాం ప‌రిశీలిస్తున్నాం అన్న మాట‌లే విని పిస్తాయి.


ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోరిక‌లు అన్నీ అలానే ఉండిపోయాయి. రాష్ట్రం విడిపోయాక మ‌నం కోరుకున్న‌వి కేంద్రం తీర్చ‌లేదు. ఇక‌పై తీర్చ‌దు కూడా..! మ‌నం అనుకున్న‌వ‌న్నీ కేంద్రానికి న‌చ్చ‌క‌పోవ‌డం, కేంద్రం చేస్తున్న‌వేవో రాష్ట్రం చెప్ప‌క పోవ‌డంతో ప్ర‌తీ ప‌ని సులువుగా చ‌క్క‌దిద్ద‌డం అన్న‌ది కేంద్రం మ‌రిచిపోయిన విధానం. అలానే సీఎంల‌లో డైన‌మిజం లేదు. ఆ రోజూ లేదు ఈ రోజూ లేదు. చంద్ర బా బు కానీ జ‌గ‌న్ కానీ వీరిద్ద‌రూ ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే అదే ప‌నిగా ఢిల్లీలో కూర్చొని లాబీయింగ్ చేసి ప‌నులు చేయించేంత స‌మ‌ర్థు లు అయితే కాద‌ని నిరూపితం అయిపోయింది.

శాస‌న మండ‌లి ర‌ద్దుకు సంబంధించి వ‌చ్చిన వార్త ఏ మాత్రం హ‌డావుడి లేకుండానే వెన‌క్కు పోయింది. మీడియా చేసినంత హాడా విడి  పార్ల‌మెంట్ చేయ‌దు. కేంద్రం కూడా సింపుల్ గా ప‌రిశీల‌న‌లో ఉంది అని చెప్పింది. దీంతో మండ‌లి ర‌ద్దు అంశాన్ని  జాతీయ స్థాయిలో ఒక వివాదంగా మార్చుకుందాం అనుకున్న వారికి ఇదెంత మాత్రం క‌లిసి రాని ప‌రిణామం అయి కూర్చొంది. మండ‌లి ర‌ద్ద‌యితే వైసీపీకి న‌ష్టం. టీడీపీకి లాభం.. కానీ ఇప్పుడు కొందరు రాజ‌కీయ నిరుద్యోగుల‌కు మండ‌లి చాలా అవ‌స‌రం క‌నుక మం డలి ర‌ద్దు కాకుండా ఉంటేనే మేలు. కానీ ఇప్పుడు అది సులువు కాదు. రెండోది దిశ చ‌ట్టంకు సంబంధించి ఏపీ స‌ర్కార్ చేసిన ప్ర‌తి పాద‌న‌లు ఏవీ ఇంకా ఆమోదానికి నోచుకోలేదు. ఇది కూడా పెండింగే. ఇక మూడోది ర‌ఘు రామ పై అన‌ర్హ‌త వేటు ఇది కూడా పెండిం గే. ఏం మాట్లాడినా మాట్లాడ‌కున్నా ప‌రిశీలిస్తున్నాం..త్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న చేస్తున్నాం ఇవే మాటలు మోడీ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: