చైనా తీరు చూస్తుంటే కుక్కతోక వంకరలాగే కనిపిస్తోంది. భారత దేశ సైనికులు ఎన్ని సార్లు దెబ్బకొట్టినా.. వారి తీరు మాత్రం మారడం లేదు. ఏదొక విధంగా సరిహద్దుల్లో మన ప్రాంతాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా.. కవ్వింపు చర్యలకు పాల్పడేందుకు నానా ప్రయత్నాలు చేస్తోంది.  మన దేశ సైనికులను ధీటుగా ఎదుర్కోవాలని  భావించిన డ్రాగన్ కంట్రీ తమ దేశ సైనిక బలాన్ని పెంచుకునేందుకు రాక్షస ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఎల్ ఏసీ వెంట ఆధిపత్యం చలాయించేందుకు తమ దేశంలోని యువకులకు నచ్చినా నచ్చకపోయినా.. సైన్యంలోకి రావాలని బలవంతపెడుతోంది. టిబెట్ లో ఉండే ప్రతీ ఫ్యామిలీ నుంచి ఒక్కరు ఖచ్చితంగా సోల్జర్ గా ఉండి తీరాల్సిందేననే రూల్స్ పాస్ చేసింది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.

అందులో భాగంగానే టిబెట్ లోని యువతకు కఠోర శిక్షణ ఇస్తోంది. ఈ విషయాన్ని భారత నిఘా వ్యవస్థ కూడా గ్రహించింది. టిబెట్ యువతను సైనికులుగా మార్చడమే కాకుండా.. భారత సైనికులను ఎలా ఎదుర్కోవాలి.. ఎలా బెదిరించాలి.. ఎలాంటి చర్యలకు పాల్పడాలి అనే దానిపై తర్ఫీదునిస్తోంది. వారిని ఒక రకంగా చెప్పాలంటే భారత్ పైకి ఉసికొల్పేలా ప్రయత్నాలు చేస్తోంది డ్రాగన్ కంట్రీ. ఒకవైపు శాంతి మంత్రం అంటూ జపిస్తూ.. చేసే పనులు చేసుకుంటూ పోతోంది. ఒక రకంగా చెప్పాలంటే భారత సైనికులను రెచ్చగొట్టే చర్యలను మానుకోవడం లేదు. ఇప్పటికే యువతను సెలక్ట్ చేసుకున్న డ్రాగన్ కంట్రీ.. కొండ, లోయ.. మంచు.. ప్రాంతాల్లో కఠిన శిక్షణ ఇస్తోంది. టిబెటన్లతో మనకు ఝలక్ ఇవ్వాలనే ప్రయత్నాలు చేస్తోంది చైనా.

ఇదిలా ఉంటే నేడు భారత్ చైనా మధ్య 12వ దఫా చర్చలు జరుగుతున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే సరిహద్దుల్లో సైనిక బలగాల ఉపసంహరణపైనే ప్రధాన చర్చ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు తూర్పు లద్దాక్ లోని ఎల్ఏసీ ఇందుకు వేదిక అవుతున్నట్టు సమాచారం. మరి ఇరు దేశాల సైనికులు ఏం నిర్ణయిస్తారో చూడాలి. చైనా వక్రబుద్ది చూపిస్తే.. ధీటైన సమాధానం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగానే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: