ఆగస్టు 15న రమ్య హత్య జరగ్గా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని ఏపీ హోం మంత్రి సుచరిత స్పందించారు. బాధిత కుటుంబానికి పది లక్షల పరిహారం అందించారు అని ఆమె తెలిపారు. బాధిత కుటుంబానికి ఇంటిస్తలం అందించడం సహా 5 ఎకరాల పంటభూమి కేటాయించాలని సీఎం ఆదేశించారు అని ఆమె గుర్తు చేసారు. రమ్య సోదరికి జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఇవ్వాలని సీఎం ఆదేశించారు అని ఆమె వివరించారు. పదిరోజుల్లో ఉద్యోగ నియామకం అయ్యాక సీఎం తో టీ తాగే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

మహిళల అత్యాచారం   కేసుల్లో ఏడు రోజుల్లో చార్జ్ షీట్ వేస్తున్నాం అని ఆమె వివరించారు. ఇప్పటివరకు 1600 పైగా కేసుల్లో  ఏడు రోజుల్లో చార్జిషీట్  వేశాం  అని ఆమె పేర్కొన్నారు. దిశ యాప్ ను  46 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు  అని అన్నారు.  ఇంకా 50 శాతం పైన ప్రజలకు దిశ యాప్ పై అవగాహన లేదు అని ఆమె వివరించారు. దిశ యాప్ ,చట్టంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది అన్నారు. మహిళలతో పాటు మగవారు కూడా డౌన్ లోడ్ చేసుకుంటే వెంటనే మహిళలకు రక్షణ కల్పించే అవకాశం ఉంటుంది  అని తెలిపారు.

ఏడు నెలల క్రితం జరిగిన అనూష హత్య కేసులో బాధితులను పరామర్శించేందుకు లోకేష్ బయలుదేరారు అని అనూష హత్య కేసులో నిందుతుడిని వెంటనే  అరెస్టు చేసి చార్జ్ షీట్ వేశాం అని ఆమె తెలిపారు. సుగాలి ప్రీతి పై హత్యాచారంపై సీబీఐ విచారణ కు ఆదేశించాం అని గుర్తు చేసారు. సుగాలి ప్రీతి కుటుంబం వద్దకు కూడా  లోకేష్  వెళ్లి  పరామర్శిస్తే బాగుంటుందని అన్నారు. మహిళల్లో అభద్రత భావాన్ని పెంచేలా లోకేష్ వ్యవహరించడం  చేయడం దురదుష్టకరం అని ఆమె గుర్తు చేసారు. చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్ లో  దిశ చట్టం ఆమోదం కోసం తెదేపా ఎంపీలు కృషి చేయాలి అని ఆమె సూచించారు.   ఇక రమ్య తల్లి కూడా మీడియాతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని సీఎం హామీ ఇచ్చారు అని మా కుటుంబానికి న్యాయం చేసే విషయంలో అధికారులు చాలా బాగా చేశారు  అని పేర్కొన్నారు. ప్రభుత్వం నాకు తోడుగా ఉంది..ధన్యవాదాలు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: