ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వ్య‌వ‌సాయ విధానాల‌పై దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.  ఇరుగు, పొరుగు రాష్ట్రాలు ఏపీకి వ‌చ్చి అక్క‌డి ప్ర‌భుత్వం అమలు చేస్తున్న విధి విధానాల‌ను ప‌రిశీలిస్తున్నాయి. తాజాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఏపీ విధానాల‌కు స్ట‌డి చేయాల‌ని కేర‌ళ ప్ర‌భుత్వం ఆ రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ‌మంత్రిని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు పంపింద‌ని తెలిపారు.

కేర‌ళ కూడ ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాట ప‌ట్ట‌నున్న‌ది. ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ అమ‌లు చేస్తున్న సాగు విధానాల‌పై కేర‌ళ ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తొంది. అందుకోస‌మే ఏపీ విధానాలు న‌చ్చి అధ్య‌య‌నం చేయ‌డానికి కేర‌ళ గ‌వ‌ర్న‌మెంట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మంత్రిని పంపించింద‌ని వైసీపీ ఎంపీ, పార్టీ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి వివ‌రించారు. వైకాపా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న రైతు భ‌రోసా ప‌థ‌కం అత్యంత అద్భుతం అని ప్ర‌శంస‌లు కురిపించార‌ని విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించాడు.

రైతుల కోసం ప్ర‌వేశ‌పెడుతున్న సంక్షేమ ప‌థ‌కాలు, వ్య‌వ‌సాయ విధి, విధానాలు చాలా బాగుంటాయ‌ని తెలుసుకుని కేర‌ళ ప్ర‌భుత్వం అక్క‌డి మంత్రి, ప‌లు బృందాల‌ను పంపింది అని పేర్కొన్నారు.  ఏపీలో చేప‌డుతున్న అభివృద్ధి, విధానాలు దేశ‌వ్యాప్తంగా గుర్తింపు ల‌భిస్తుంద‌ని వెల్ల‌డించారు. భ‌విష్య‌త్ జ‌న్యుప‌రంగా చేప‌ట్టిన అభివృద్ధి, నాణ్య‌మైన‌, ధృవీక‌రించిన విత్త‌నాల‌ను స‌కాలంలో రైతుల‌కు ప్ర‌భుత్వం అంద‌జేస్తుంద‌ని వెల్ల‌డించారు. నూత‌న విధానాన్ని కేవ‌లం ఒక ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకొచ్చింద‌ని వివ‌రించారు. స‌కాలంలో నాణ్య‌మైన విత్త‌నాల‌కు రైతుల‌కు అందించ‌డ‌మే నూత‌న విత్త‌న విధానం ప్ర‌ధాన ల‌క్ష్యం అని పేర్కొన్నారు. దీంతో రైతులు పంట‌లు బాగా పండించి అభివృద్ధి చెందుతార‌ని వెల్ల‌డించారు. ఏపీలో చేప‌డుతున్న వ్య‌వ‌సాయ విధానం దేశానికే ఒక ఆద‌ర్శమ‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌ర‌హాలో కేర‌ళ కూడ రైతు భ‌రోసా కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఎరువులు, పురుగుల మందు బుక్ చేసుకున్న కొద్ది గంట‌ల్లోనే పంపిణీ చేస్తున్న తీరు బాగుంద‌ని కేర‌ళ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి పి. ప్ర‌సాద్ పేర్కొన్నారు. రైతుల‌కు అండ‌గా ఏపీ సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌లు అద్భుతంగా ఉన్నాయి. ఏపీ అధికారులు తెలిపిన వివ‌రాల‌ను తెలుసుకొని తాము ఆశ్చ‌ర్య‌పోయాం అని ప్ర‌క‌టించారు. ఈ విధానంను త్వ‌ర‌లో కేర‌ళ‌లో అమ‌లు చేయ‌నున్న‌ట్టు అక్క‌డి మంత్రి ప్ర‌క‌టించారు.
మరింత సమాచారం తెలుసుకోండి: