ఈ ఎన్నికల్లో జిల్లా లో ఉన్న ఎంపీ టీసీలు, జడ్పీటీసీలు , కౌన్సెలర్ల తో పాటు కార్పోరేటర్లు ఓట్లు వేస్తారు. వచ్చే నెల 10వ తేదీన ఎన్నికలు వస్తాయి. ఇక ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ రానుంది. ఇక జిల్లా లో టీడీపీ వాళ్లకు అస్సలు బలం లేదు. దీంతో వాళ్లు తమ క్యాండెట్లను పోటీలో నిలిపే పరిస్థితి కూడా లేదు. ఈ లెక్కన చూస్తే ఎన్నికలు వైసీపీకి ఏకగ్రీవం కానున్నాయి.
ఇక వైసీపీ నుంచి జగన్ ప్రోగ్రామ్ , రూట్ కన్వీనర్ తలశిల రఘురాంకు ఓ ఎమ్మెల్సీ పదవి ఖరారు అయినట్టు చెపుతున్నారు. ఇప్పటికే ఆయన కేబినెట్ ర్యాంకు పదవిలో ఉన్నారు. అయితే ఆయన తనకు ఎమ్మెల్సీ కావాలని అడగడంతో జగన్ ఓకే చెప్పారని అంటున్నారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. అలాగే మరో పదవి బీసీలకు ఇచ్చే ఆలోచన లో జగన్ ఉన్నారట.
అయితే గన్నవరం నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయిన దుట్టా రామచంద్ర రావు తో పాటు గన్నవరంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు కూడా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. వీరిలో యార్లగడ్డ కూడా కమ్మ కావడంతో ఆయనకు అవకాశం లేనట్టే.. ? మరి ఆ ఎమ్మెల్సీ దుట్టా కు వస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి