అధికార వైసీపీలో ఏ ఎమ్మెల్యే అద్భుతమైన పనితీరు కనబరుస్తూ...ప్రజలకు అండగా ఉంటూ, ప్రజల సమస్యలని పరిష్కరించడంలో ముందున్నారంటే...కొందరు ఎమ్మెల్యేలు పేర్లు ప్రధానంగా వినిపిస్తాయనే చెప్పాలి. వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో టాప్ 10 ఎమ్మెల్యేలు..అన్నిటిలోనూ ముందున్నారని చెప్పొచ్చు. అలా అన్నిటిల్లో ముందుంటూ...ప్రజల మద్ధతు మరింతగా పొందుతున్న ఎమ్మెల్యేల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ముందు ఉన్నారనే చెప్పొచ్చు.

చంద్రబాబు పుట్టిన గడ్డ అయిన చంద్రగిరిలో గత రెండు పర్యాయాలుగా వైసీపీ జెండా ఎగురుతున్న విషయం తెలిసిందే. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా చెవిరెడ్డి సత్తా చాటుతూ వస్తున్నారు. మామూలుగానే చెవిరెడ్డికి దూకుడు ఎక్కువ. దూకుడుగానే రాజకీయం చేస్తారు...పనులు చేస్తారు. అందుకే ప్రజల మద్ధతు ఈయనకు ఎప్పుడూ ఉంటుంది. అసలు చంద్రగిరిని అభివృద్ధి బాట పట్టించి...అక్కడి ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం చెవిరెడ్డి ఎప్పుడూ కృషి చేస్తుంటారు.


అసలు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడంలో చెవిరెడ్డి ముందే ఉన్నారు. అలాగే పార్టీలకు అతీతంగా పథకాలు అందించడం....పనులు చేసి పెట్టడం చేస్తున్నారు. ఇది సమస్య అనే వచ్చే ప్రజలకు ఎప్పుడు అండగానే ఉంటారు. నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తూ ప్రజల సమస్యలని తెలుసుకుంటారు.

అందుకే వైసీపీలోనే చెవిరెడ్డి టాప్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక చెవిరెడ్డి టాప్‌లో ఎందుకు ఉన్నారో..తాజాగా జరిగిన ఒక ఘటన ఉదాహరణగా నిలుస్తుంది. చిత్తూరు జిల్లాలోని రాయలు చెరువు కట్టకు ప్రమాదం వాటిల్లుతుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ చెరువు కట్ట తెగితే...చుట్టూ పక్కల వందల గ్రామాలు మునగడం ఖాయం. అయితే చెరువు కట్ట తెగిపోకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అయితే దగ్గర ఉండి పనులు చేయిస్తున్నారు. అసలు చెరువుకట్టపైనే నిద్రిస్తూ పనులు పర్యవేక్షిస్తూ, ఆయన బహిరంగ ప్రదేశంలోనే స్నానం చేస్తూ, దొరికిన ఆహారం తింటూ గడుపుతున్నారు. అంటే ఒక ఎమ్మెల్యే ఇలా ప్రజల కోసం నిలబడటం అనేది గొప్ప విషయమే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: