సైనిక హెలికాప్టర్ ప్రమాద ఘటనలో తెలుగు సైనికుడు లాన్స్ నాయక్ కూడా మరణించారు. ఆయన మరణ వార్తను విన్న టువంటి కుటుంబ సభ్యులు నమ్మలేక పోయారు. మాతో ఇంతకుముందే వీడియో కాల్ మాట్లాడాడని ఆయన మాట్లాడిన మాటలు కండ్ల ముందు మెదులుతున్నాయి అని ఆయన మరణ వార్తను విన్న వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. కళ్ళ నిండా కమ్ముకున్న టువంటి నీళ్లతో వీడియో కాల్ లో అతని చివరి చూసినటువంటి దృశ్యం చెల్లా చెదురైపోయింది. వారి పిల్లలకు ఆ విషయం పెద్దగా అర్థం కాకపోయినా అతని భార్య మాత్రం ఏడుస్తూ కుప్పకూలిపోయింది. తమిళనాడు రాష్ట్రంలోని గుంటూరు సమీపంలో జరిగినటువంటి ఘటనలో సిడిఎస్ వ్యక్తిగత భద్రతా బృందం సభ్యులు లాన్స్ నాయక్ సాయి తేజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువ రేగడ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయనకు భార్య శ్యామల, కుమార్తె దర్శిని కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. ఐదేళ్ల క్రితం సాయి తేజ కు శ్యామలతో వివాహం జరిగింది.
మదనపల్లి లోని సిబిఐ కాలనీలో నివాసముంటున్నారు. ఆయన వాటితో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు సార్ తో క్యాంపుకు వెళ్తున్నానని నేను ఫోన్ చేసే వరకు మీరు ఫోన్ చేయవద్దు అని సారు తో ఉన్నాం అని ఆయన చివరి మాట మాట్లాడాడు. అంతకుముందు ఉదయం నుంచి పిల్లలు నాన్నను చూడాలి అని గొడవ చేశారని, దీంతో శ్యామల సాయి తేజ కి ఫోన్ చేసింది. అయితే అప్పటికే రావత్ తో ప్రయాణమవుతున్న సాయి తేజ  నేను సార్ తో ఉన్న ఫోన్ చేయొద్దు అని చెప్పాడు. పిల్లలు ఒక్కసారి చూడాలి అంటున్నారని వీడియో కాల్ చేయమని చెప్పింది. దీంతో తేజ కొంతసేపు వీడియో కాల్ చేసి పిల్లలతో మాట్లాడారు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో మదనపల్లి లోని భార్యతో కొద్దిసేపు మాట్లాడాడు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల ముప్పై సమయంలో ప్రమాదం విషయం తెలిసింది. దీంతో అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: