కోవిడ్-19 తాజా వేరియంట్ ఓమిక్రాన్ ఉధృతి నానాటికీ పెరుగుతున్న వేళ   అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆ దేశం నిషేధాజ్ఞలు మరోసారి  విధించింది.  వాస్తవానికి ఈ నెలాఖరు నుంచి అంతర్జాతీయ రాకపోకలు జరగాల్సి ఉంది. కాని పరిస్థితులు అనుకూలించక పోవడంతో నిషేధం తప్పనిసరైంది. ఇంతకీ ఎక్కడో  తెలుసా ?
ప్రపంచ వ్యాప్తంగా మానవాళి పై కోవిడ్-19 తాజా వేరియంట్ తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న వేళ ఐరోపా దేశాలు ఓమిక్రాన్ ధాటికి తల్లడిల్లిపోతున్నాయి. ఈ దేశాలే కాక  ప్రపంచం లోని ఎన్నో దేశాలు ఓమిక్రాన్ ప్రభావం కారణంగా ఎన్నో ఆంక్షలు విధించాయి. విదేశీ ప్రయాణాలపై ఎక్కువ నిషేధం అమలు చేస్కున్నాయి. భారత్ కూడా విదేశీ రాకపోకల పై నిషేధం విధించింది.  ఈ నిషేధం జనవరి 31 వరకూ అమలులో ఉంది. కాగా విదేశాలలో కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో భారత్ అలెర్ట్ అయింది. ఈ నిషేధాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించింది. తాజా ఉత్తర్వులతో ఫిబ్రవరి 28వ తేదీ వరకూ అమలు లో ఉంటాయని భారత  ప్రభుత్వం పేర్కోంది. కరోనా రెండో వేవ్ తరువాతి కాలంలో భారత దేశం విదేశీ యానం పై ఆంక్షలు కొంత సరళతరం చేసింది. 2021 డిసెంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని భావించింది. అయితే భారత్ తొందర పడి నిర్ణయం తీసుకోలేదు. కారణం ఏమిటంటే అప్పటికే కోవిడ్-19 తాజా వేరియంట్ విదేశాలలో తన ప్రతాపాన్ని చూపుతోంది.  విపరీతమైన వేగంతో అందరినీ  పట్టుకుంది. దీంతో భారత్ అధికారులు  విదేశీ రాకపోకలపై నిషేధం విధించారు. తాజా గా ఆ నిషేధాన్ని మరో కొంత కాలం పొడిగించారు.  కోవిడ్-19 ప్రపంచం పై పడగ విప్పిన వేళ అన్ని దేశాల తో పాటుగా, మన దేశం కూడా 2020 మార్చి నుంచి విదేశీ విమాన యానాన్ని కట్టడి చేసింది. తరువాత కొద్ది రోజులకు స్వదేశీ విమానయానాన్ని కూడా నిలుపుదల చేసింది. అయితే విదేశాలలో చిక్కుకుని పోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు 2020 జూలై నెల నుంచి వందేభారత్ మిషన్ కార్యక్రమం పేరిట విదేశాలకు విమాన సర్వీసులు నడిపింది. ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో తాజాగా నిషేధం విధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: