కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ఈనెల 30, ఏప్రిల్ 11 ఈ రెండు రోజులు మంచి రోజులుగా చెబుతున్నారు. కానీ.. ఏప్రిల్ 1 అమవాస్య వస్తోంది. అందుకే అమావాస్య ముందు ఈ శుభకార్యక్రమం ఎందుకని సీఎం జగన్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అందుకే ఆయన ఏప్రిల్ 11 కే మొగ్గు చూపుతున్నారట. ఈలోపు కొత్త మంత్రులకు సమాచారం ఇవ్వడం.. తీసేసే పాత మంత్రులను సముదాయించడం వంటి కార్యక్రమాలు ఉండొచ్చు.
ఏప్రిల్ 11నే కొత్త మంత్రివర్గం ఏర్పాటు ఉంటుందని సీఎం జగన్ ఇటీవల ఓ మంత్రితో అన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరికొందరి వద్ద కూడా సీఎం జగన్ ఇదే అభిప్రాయం వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. కానీ.. సీఎంఓ మాత్రం ఇంకా తమకు ఎలాంటి సమాచారం రాలేదని చెబుతోంది. అదే సమయంలో జగన్ కొత్త కేబినెట్ కూర్పుపైనా జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఏ సామాజిక వర్గానికి ఎందరిని ఉంచుతారన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం రెడ్లు, కాపులకు నాలుగు చొప్పున మంత్రి పదవులు ఉన్నాయి. అయితే..కొత్త కేబినెట్‌లో ఈ రెండు సామాజిక వర్గాలకూ ఒక్కో పదవి తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రెండు కులాలకు ఒక్కో కులానికి మూడు చోప్పున మంత్రి పదవులు దక్కవచ్చని తెలుస్తోంది. ఇలా తగ్గించడం ద్వారా ఏర్పడే రెండు ఖాళీలను బడుగు వర్గాలతో నింపాలన్నది జగన్ ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. ఈ రెండింటిలో ఒకటి బీసీ వర్గానికి.. మరొకటి ఎస్సీ వర్గానికి ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి