
దీంతో ప్యానెల్ స్పీకర్ కల్పించుకోని ప్రేం చందర్ ఇది కోర్టు పరిధిలోని అంశం అని దీనిపై పార్లమెంట్ లో మాట్లాడమేంటని అన్నారు. మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు సీమెన్స్ కంపెనీతో ఒప్పందం విషయంలో అవకతవకలు జరిగాయని మాట్లాడారు. కోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి పార్లమెంట్ లో మాట్లాడటం సరికాదని ప్యానెల్ స్పీకర్ చెప్పారు.
అయితే కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని టీడీపీ ఎంపీలు ఎలా లేవనెత్తుతారని ఆయన ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు పీఎ విదేశాలకు పారిపోయాడని ఆయన ముఖ్య సూత్రధారుడని తెలిపారు. దేశంలో ఏ స్కాం చేసిన స్టార్ కూడా తను దోషి అని చెప్పడని అన్నారు. చంద్రబాబు ను ఉద్దేశించి మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్యానెల్ స్పీకర్ తెలిపారు. లోక్ సభ సచివాలయం ఇలాంటి వ్యాఖ్యల్ని అనుమతించబోమని చెప్పారు.
అసలు కోర్టు పరిధిలోని అంశాలను ఇక్కడ చర్చించుకోవడం ఏంటని అన్నారు. మిథున్ రెడ్డి రామ్మోహన్ నాయుడుని కూర్చోరా అని పదే పదే అనడం వివాదానికి దారి తీసింది. గౌరవ ఎంపీని లోక్ సభలో అలా మాట్లాడటం ఏంటని రాజకీయ మేధావులు ప్రశ్నిస్తున్నారు. లోక్ సభ లాంటి రాజ్యాంగ సభల్లో హుందాతనం పాటించాలని ఆయనకు సూచిస్తున్నారు. మొత్తానికి ఏపీ నేతలు రాష్ట్రం పరువు పార్లమెంటులోనూ తీసేస్తున్నారు.