ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఎలక్షన్స్ రానున్న నేపథ్యం లో ఇంతకాలం పాటు పార్టీని పట్టుకొని ఉన్నవారు ఆ పార్టీలో టికెట్లను ఆశిస్తున్నారు. అయితే అందులో కొంత మంది కి టికెట్లు వస్తుండగా మరి కొంత మంది కి రావడం లేదు. దీనితో ఆ పార్టీపై గుర్రుగా ఉండి అనేక మంది ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ అయినటువంటి వైసీపీ నుండి ఎంతోమంది నాయకులు టిడిపి , జనసేన , కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారు. అందులో భాగంగా వైసిపి పార్టీ నుండి మరో కీలక నేత టిడిపి పార్టీలోకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.

గతంలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఓ కీలక నేత  శిద్ధా రాఘవరావు తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు కొంత కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తుంది ప్రకాశం జిల్లాకు చెందిన వైశ్య సామాజిక వర్గ నేత మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు గతంలో టిడిపి కేబినెట్ లో మంత్రిగా చాలా కాలం పని చేశారు. ఆ అనంతరం టీడీపీ ఎంపీగా ఒంగోలు నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయారు. 

ఇక ఆ తర్వాత వైసిపి పార్టీ అధికారం లోకి రావడంతో ఈయన వైసిపి పార్టీలోకి జంపు అయ్యారు. ఇన్ని రోజుల.పాటు వైసీపీతో ప్రయాణం చేసిన ఈయనకు ఆ పార్టీ నుండి టికెట్ రాకపోవడంతో మళ్లీ ఈయన టిడిపి గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది. కీలకమైన వైశ్య సామాజిక వర్గ నేత కావడం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఈయనకు అద్భుతమైన పట్టు ఉండడంతో టిడిపి పార్టీ కూడా ఈయనకు టికెట్ ఇచ్చి సాధారణంగా తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో వైసిపి పార్టీ మరో కీలక నేతను కోల్పోబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: