ప్ర‌స్తుత పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఖాయ‌మ‌ని భావించిన న‌ర‌సాపురం పార్ల‌మెంటు స‌భ్యుడు, వైసీపీ మాజీ నేత‌, రెబ‌ల్ నాయ‌కుడు.. క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు.. ఈ ద‌ఫా ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వ‌లేదు. వాస్త‌వానికి న‌ర‌సాపురం పార్ల‌మెం టు స్థానాన్ని టీడీపీ, జ‌న‌సేన‌ల కూట‌మి బీజేపీకి కేటాయించింది. దీంతో ఇక‌, త‌న‌కు టికెట్ వ‌స్తుంద‌ని ర‌ఘురామ భావించారు. ఇదే విష‌యాన్ని తాడేప‌ల్లిగూడెంలో నిర్వ‌మించిన జ‌న‌సేన‌, టీడీపీ ఉమ్మ‌డి జెండా స‌భ‌లో ఆయ‌న చెప్పుకొచ్చారు.

తాను ఈ రెండు పార్టీల ఉమ్మ‌డి స‌భ్యుడిగానే న‌ర‌సాపురం నుంచి పోటీ చేస్తాన‌ని చెప్పారు. ఇంత‌టితో త‌న పని అయిపోయింద‌ని అనుకు న్నారు. ఇక‌, చంద్ర‌బాబు కూడా ర‌ఘురామ‌కు టికెట్ ఇవ్వాల‌ని.. బీజేపీకి మాట మాత్రంగా అయితే చెప్పుకొచ్చారు. దీంతో ర‌ఘురామ‌కు మ‌రింత ఆశ పెరిగింది. త‌న‌దే నియోజ‌క‌వ‌ర్గం అని భావించారు. కానీ, తెర‌చాటున మ‌రో విష‌యాన్ని ఆయ‌న మ‌రిచిపోయారు. బీజేపీ కేటాయించిన స్థానంలో ఆ పార్టీ టికెట్ ఇచ్చేందుకు రెండు ప్ర‌ధాన విష‌యాల‌ను పరిశీలిస్తుంది.

ఒక‌టి.. టికెట్ కోరుకునే నాయ‌కుడు బీజేపీ స‌భ్యుడై ఉండాలి. ఈ విష‌యంలో ర‌ఘురామ విఫ‌ల‌మ‌య్యారు. బీజేపీలో ఆయ‌న చేర‌లేదు. చేరాల‌ని కూడా ఆయ‌న అనుకున్నారో లేదో తెలియ‌దు. ఇప్ప‌టికీ ఆయ‌న ఏ పార్టీలోనూ చేర‌క‌పోవ‌డం ప్ర‌థ‌మ త‌ప్పు. దీంతో ఆయ‌న వ్య‌వ‌హారాన్ని బీజేపీ నేత‌లు ప‌ట్టించుకోలేద‌ని తెలిసింది. ఇక‌, మ‌రో ప్ర‌ధాన పొర‌పాటు.. బీజేపీ టికెట్లు ఆశించేవారి నుంచి ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీల‌తో స‌హా.. అంద‌రి నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించింది. ఇది.. దాదాపు నెల రోజుల పాటు జ‌రిగింది.

దేశ‌వ్యాప్తంగా జ‌న‌వ‌రి 20-ఫిబ్ర‌వ‌రి 20 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు తీసుకున్నారు. ఈ స‌మ‌యంలోనూ ర‌ఘురామ ఎలాంటి ద‌ర‌ఖాస్తు ఇవ్వ‌లేదు. పైగా న‌ర‌సాపురం టికెట్ త‌మ‌కు కావాలంటూ.. ఇద్ద‌రు బీజేపీ నేత‌లు ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించారు. ఈ స్థానం నుంచి సీనియ‌ర్ నేత భూపతిరాజు శ్రీనివాస వర్మ, పాకా సత్యనారాయణలు దరఖాస్తు చేసుకున్నారు. చివరకు సాధారణ కార్యకర్త నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగిన శ్రీనివాసవర్మకు చాన్స్‌ ఇచ్చారు.

అంటే మొత్తంగా జ‌రిగిన ప‌రిణామాల్లో ఇటు చంద్ర‌బాబుది కానీ.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌మేయం కానీ లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అతి విశ్వాసంతో త‌న‌కు టికెట్ ఖాయ‌మ‌ని భావించిన ర‌ఘురామే.. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించార‌ని బీజేపీ నేత‌లు వ్యాఖ్య‌నిస్తున్నారు. క‌నీసం పార్టీలో చేర‌కుండా.. పోనీ.. ద‌ర‌ఖాస్తు కూడా చేసుకోకుండా.. అంతా అదే అయిపోతుంది.. త‌న‌కు టికెట్ ఇచ్చేస్తారు.. ఇక‌, నామినేష‌న్ వేయ‌డ‌మే త‌రువాయి అని భావించి.. ఆయ‌న చేసిన త‌ప్పులో ఆయ‌నే ఇరుక్కున్నార‌ని అంటున్నా

మరింత సమాచారం తెలుసుకోండి: