ప‌ల్నాడు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రిని క‌దిలించినా ఒకే మాట వినిపిస్తోంది. వారు వీరు.. అనే తేడా లేదు.. ముస‌లి ముత‌కా అనే భేదం కూడా లేదు. అంద‌రి నోటా జీవీ మాట అన్న‌ట్టుగా.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు జీవీ ఆంజ‌నేయులు పేరే వినిపిస్తోంది. త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో వార్ వ‌న్‌సైడ్ అయిపోవ‌డంతో పాటు ఆయ‌నకు వ‌చ్చే మెజారిటీనికూడా చెప్పేస్తున్నారు. దీంతో వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ జోరు మ‌రింత పెరిగింది.

వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జీవీ ఆంజ‌నేయులు మ‌రోసారి పోటీకి రెడీ అయ్యారు. ఒక‌వైపు పార్టీ బాధ్య‌త‌లు చూస్తేనే మ‌రోవైపు.. వ్య‌క్తిగ‌తంగా ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆంజ‌నేయులు వ‌రుస‌గా నాలుగోసారి పోటీ చేస్తున్నారు.

ఎక్క‌డ స‌మ‌స్య ఉంటే అక్క‌డ వాలిపోతున్నారు. పేద‌ల‌కు.. క‌ష్టాల్లో ఉన్న‌వారికి నేనున్నానంటూ చేరువ అవుతున్నారు. స‌హ‌జంగా ఏ నాయ‌కుడైనా.. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల్లోకివ‌స్తారు. కానీ, దీనికి భిన్నంగా జీవీ మాత్రంఎన్నిక‌ల‌కు ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఏడాది నుంచే ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. రైతులు, వృద్ధులు, విద్యార్థులు ఇలా.. అన్ని వ‌ర్గాల వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. ఫ‌లితంగా ఇప్పుడు ఏనోట విన్నా.. జీవీ పేరు మార్మోగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జీవీనే గెలుస్తార‌ని మెజారిటీ ప్ర‌జ‌లు నొక్కి చెబుతున్నారు. అంతేకాదు.. ఆయ‌నకే త‌మ ఓట‌ని ఎన్నిక‌ల‌కు మూడు మాసాల ముందే వెల్ల‌డిస్తున్నారు.

మ‌హిళ‌లు, వృద్ధులు, యువ‌త ఇలా ఏ ఒక్క‌రిని క‌ద‌లించినా ఇదే మాట వినిపిస్తోంది. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జీవీ ఏకంగా 35 - 40వేల‌ ఓట్ల  మెజారిటీని సొంతం చేసుకుంటార‌ని కూడా చెబుతున్నారు. వాస్త‌వానికి నాయ‌కులు త‌మ‌కు వ‌చ్చే మెజారిటీపై లెక్క‌లు వేసుకుంటారు. ఇంత వ‌స్తుంది.. అంత వ‌స్తుంద‌ని చెప్పుకొంటారు. కానీ, నేరుగా ప్ర‌జ‌లే జీవీకి 40 వేల ఓట్ల మెజారిటీ వ‌స్తుంద‌ని చెప్ప‌డం చూస్తుంటే వినుకొండ‌లో టీడీపీ జోరు ఎలా ఉందో తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: