ఎన్నికల నగారా మ్రోగడంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.. ఇప్పటికే అధికార పార్టీ అయిన వైసీపీ 175 నియోజకవర్గ అభ్యర్థులని ప్రకటించగా ప్రతిపక్ష కూటమి అయిన బీజేపీ టీడీపీ, జనసేన తమ అభ్యర్థుల సీట్ల పంపకంలో తలమునకలై వున్నాయి.దీనిలో భాగంగా దర్శి నియోజకవర్గం టిడిపి అభ్యర్ధి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతుంది.దర్శి నుంచి మాజీ మంత్రి, ప్రస్తుతం వైసిపిలో కొనసాగుతున్న శిద్దా రాఘవరావు పేరును ఎంపిక చేసేందుకు టిడిపి అధిష్టానం పరిశీలిస్తోంది.దాదాపు శిద్దా రాఘవరావు పేరు ఖరారయ్యే చివరి నిమిషంలో సియం వైయస్‌ జగన్‌ నుంచి శిద్దాకు పిలుపువచ్చింది. పార్టీ మారే ఆలోచనలో ఉన్న శిద్దాను  వైసిపి అధిష్టానం బుజ్జగించే పనిలో ఉంది . రానున్న ఎన్నికల్లో శిద్దా రాఘవరావు దర్శి వైసిపి టికెట్‌ ఆశించారు. అయితే అధిష్టానం పెద్దలు మాత్రం తొలుత అద్దంకి, ఆ తరువాత ఒంగోలు చివరకి మార్కాపురం నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని శిద్దాకు సూచించినట్లు తెలుస్తోంది.

శిద్దా మాత్రం తాను దర్శి నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో ఆయనకు వైసిపి టికెట్‌ లభించలేదు. ఈ నేపధ్యంలో టిడిపిలో చేరి ప్రస్తుతానికి ఖాళీగాఉన్న దర్శి టిడిపి స్థానం నుంచి పోటీ చేయాలన్న ఒత్తిడి టిడిపి నుంచి ఎదురైంది. దర్శి నుంచి టిడిపి టికెట్‌పై పోటీ చేసేందుకు శిద్దా సిద్ధం అయ్యేలోపే వైసిపి అధిష్టానం నుంచి శిద్దాకు పిలుపువచ్చిందట. సియం వైయస్‌ జగన్‌ను కలవాలని వైసిపి అధిష్టానం పెద్దలు శిద్దాకు సూచించినట్లు సమాచారం. దీంతో దర్శిలో టిడిపి టికెట్‌పై శిద్దా పోటీ చేసే విషయంలో సందిగ్దత నెలకొంది. సియంతో తాజాగా భేటీ అనంతరం ఆయన ఏం మాట్లాడారో, ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది శిద్దా చెబితేకానీ తెలియని పరిస్థితి అయితే నెలకొంది. మరో రెండు రోజుల్లో శిద్దా రాఘవరావు టిడిపిలో చేరి దర్శి నుంచి పోటీ చేస్తారనుకుంటున్న తరుణంలో వైసిపి అధిష్టానం నుంచి పిలుపురావడంతో ఇక శిద్దా దర్శిలో టిడిపి నుంచి పోటీ చేయడం ఆనుమానమే అని అందరూ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: