ఆంధ్ర రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారిపోతూనే ఉంది. అయితే టిడిపి జనసేన పొత్తు మొదటి నుంచే ఉంది. కానీ కొత్తగా బిజెపి కూడా ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకు నడుస్తూ సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. కాగా జనసేనకు రెండు ఎంపీ స్థానాలతో పాటు 21 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. బిజెపికి ఆరు ఎంపీ స్థానాలు 1 అసెంబ్లీ స్థానాలను అంగీకరించారు.


 ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న టిడిపి ఇక మెజారిటీ స్థానాలలో ఏపీ ఎన్నికల్లో బరులు దిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒప్పందం ప్రకారం బిజెపికి రెండు ఎంపీ సీట్లతో పాటు 10 అసెంబ్లీ స్థానాలు కూడా కేటాయించారు. కానీ ఇప్పుడు సీట్ల సర్దుబాటు విషయంలో బిజెపి కొత్త డిమాండ్ తెరమీదకి తీసుకురావడంతో చంద్రబాబుకు కొత్త తలనొప్పి మొదలైంది అన్నది తెలుస్తుంది. బిజెపి ఇప్పటికే ఆరు ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. అయితే పది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఇప్పటికే నిర్ణయించామని చెబుతున్న ఇక అధికారిక ప్రతినిధుల మాత్రం రాలేదు.


 ఇంతలోనే తమకు అదనంగా మరో సీటు ఇవ్వాలి అంటూ కొత్త డిమాండ్ తెర మీదకి వచ్చింది. ఇటీవలే బిజెపి ఎన్నికల ఇన్చార్జ్ అరుణ్ సింగ్ నేతృత్వంలో పదాధికారుల సమావేశం జరగగా..  బీజేపీ 11 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. అయితే బిజెపి సీనియర్ నేత సోము వీర్రాజు కోసం తొలిత రాజమండ్రి ఎంపీ పరిధిలోని అనపర్తి స్థానం ఇచ్చేందుకు సిద్ధమైన.. ఇక అక్కడ నుంచి పోటీ చేసేందుకు వీర్రాజు విముఖత వ్యక్తం చేశారట. దీంతో ఇప్పుడు రాజమండ్రి సిటీ, లేదంటే రాజమండ్రి రూరల్ స్థానాలలో ఏదో స్థానాన్ని అదనంగా బిజెపికి ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారట.



కాగా రాజమండ్రి సిటీ బీసీకి ఇప్పటికే ఖరారు అయింది  అయితే రాజమండ్రి రూరల్ పైన బిజెపి ఆసక్తిగా ఉంది. కాగా ప్రస్తుతం అక్కడ టిడిపి సీనియర్ అయితే నేత బచ్చయ్య చౌదరి పోటీలో ఉన్నారు. ముందు జనసేనకు ఈ స్థానాన్ని ఇవ్వాలని అనుకున్న నిరసనలు రావడంతో ఇక బుచ్చయ్యకే కేటాయించారు   కానీ ఇప్పుడు బిజెపి డిమాండ్ నేపథ్యంలో చంద్రబాబు రాజమండ్రి రూరల్ బిజెపికి కేటాయిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: