అనకాపల్లి లోకసభ ఎన్నిక రసవత్తరంగా మారింది.ఎందరో ఉద్దండులు ప్రాతినిద్యం వహించిన అనకాపల్లి లోకసభ స్థానానికి ఘన చరిత్ర ఉంది.1962లో ఏర్పడిన ఈ లోకసభ స్థానానికి మొత్తం మీద 15సార్లు ఎన్నికలు జరిగితే 9సార్లు కాంగ్రెస్,5 సార్లు టీడీపీ, మొదటిసారి గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.ఈసారి కూడా గెలుపే లక్ష్యంగా ఆచి తూచి అలోచించి బూడి ముత్యాలనాయుడిని బరిలోకి దింపింది అధికార పార్టీ వైసీపీ.కూటమి తరపున బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ను దించారు.అయితే ఇద్దరు ప్రత్యర్థులు కూడా ఒకే సామజికవర్గానికి చెందిన వ్యక్తులు.బూడి అనకాపల్లి జిల్లాకి చెందిన మాడుగుల నియోజకవర్గానికి చెందినవారు కాగా సీఎం రమేష్ రాయలసీమకు చెందిన వారు.అయితే వైసీపీ మాత్రం సీఎం రమేష్ నాన్ లోకల్ అనే నినాదంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు.

వాస్తవంగా కూటమిలోని టీడీపీ నుండి చింతకాయల విజయ్, జనసేన నుండి నాగబాబు,కొనదాలా రామకృష్ణ భావించారు.అయితే ఈ టికెట్ బీజేపీ కి దక్కడంతో ఆ పార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావును వెనక్కి నెట్టి టికెట్ దక్కించుకున్నారు సీఎం రమేష్.ఆయన్ను ఢీ కొట్టాలి అంటే అదే సామజికవర్గానికి మరియు ఆర్ధికంగా బలపడిన వ్యక్తి కనుక మొదటిసారి బూడిని లోకసభ బరిలో దించింది వైసీపీ.ఆయన 2014,2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిచి జగన్ కాబినెట్లో ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు.అయితే ప్రస్తుతం ఆయనకు కొన్ని కారణాల వల్ల వ్యతిరేకత బాగా కనబడుతుందని అంటున్నారు పరిశీలకులు.అయితే సీఎం సంక్షేమ పధకాలు ఆయన్ను మళ్ళా గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు బూడి.అయితే తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీ నుండి స్టార్ట్ చేసిన సీఎం రమేష్ గత ఎన్నికల తర్వాత బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.

మొదట విశాఖ నుండి బరిలో దిగుదామని అనుకున్న ఆ టీడీపీకి దక్కడంతో ఆయన అనకాపల్లి నుండి బరిలో ఉన్నారు.సీఎం రమేష్ తన వాక్ చాతుర్యంతో వైసీపీ గుండెల్లో భయం సృష్టిస్తున్నారు.మొత్తానికి వైసీపీ అభ్యర్థి అధికార బలంతో, కూటమి అభ్యర్థి ధన బలంతో హారహోరిగా తలబడుతున్నారు. అయితే గెలుపు ఎవరి సొంతం అనేది మాత్రం వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: