ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుల్లో, కార్యకర్తలకు హైట్ టెన్షన్ పెరుగుతుంది. గెలుపు ఎవరి వైపు ఉందో ఎవరికి అర్థం కావడం లేదు. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తూ ఉంటే తెలుగుదేశం, జనసేన, బీ జే పీ పార్టీలు పొత్తులో భాగంగా పోటీలో దిగాయి. దానితో మొదట వైసీపీ కంటే కూటమే బలంగా ఉంటుంది అని జనాలు భావించారు. కాకపోతే ఆ తర్వాత సీట్ల పంపిణీ విషయంలో స్ట్రాంగ్ కాండిడేట్ లకి కూడా కొన్ని ప్రాంతాల్లో సీట్లు దక్కకపోవడంతో ఇది వైసీపీకి చాలా కలిసివచ్చే అంశంగా కొంతమంది పరిగణిస్తున్నారు.

ఇకపోతే వైయస్ జగన్ రాష్ట్రంలోని అన్ని సీట్లపై ఫోకస్ పెడుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాలపై మాత్రం ప్రత్యేక దృష్టిని సారించారు. ఆ ప్రాంతాలు ఏవో కావో ప్రస్తుతం మంత్రులుగా చేస్తున్న నియోజకవర్గాలు. ఎందుకు అంటే మంత్రులుగా చేస్తున్న వారే ఓడిపోతే పార్టీకి పెద్ద స్థాయిలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అని... అలాంటి స్థానాల్లో అస్సలు ఓడిపోకూడదు అని జగన్ సీరియస్ గా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో పని చేస్తున్న వారిలో విడుదల రజని ఒకరు. ఈమె ఇంతకుముందు చిలకలూరుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొంది మంత్రిగా జగన్ వర్గంలో చోటు దక్కించుకుంది. ఇక ఈ ఎలక్షన్లలో ఈమె గుంటూరు వెస్ట్ నుండి పోటీ చేయబోతోంది. టీడీపీ నుంచి కొత్త అభ్యర్ది మాధవి బరిలోకి దిగారు. ఇక్కడ ఇద్దరు మహిళ అభ్యర్థులే కావడంతో పోరు రసవత్తరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి గెలుపు అవకాశాలను అంచనా వేయాలి అంటే... వైసీపీ పార్టీ ఇక్కడి టికెట్ ను చాలా రోజుల క్రితమే రజనీకి డిక్లేర్ చేసింది.

దానితో ఆమె గత మూడు నెలల నుంచి ఈ ఏరియాలో జోరుగా ప్రచారాలను నిర్వహిస్తోంది. అలాగే క్యాడర్ ను కూడా బలంగా చేసుకుంది. ఇక కూటమి ఎన్నో తర్జన బర్జనల తర్వాత కొన్ని రోజుల క్రితమే మాధవికి ఈ ఏరియా సీటును క్లియర్ చేసింది. దానితో ఇప్పుడే ఈమె ప్రచారాలను మొదలు పెట్టింది. ఇలా ఈమె తాజాగా ప్రచారాలను మొదలుపెట్టడం, రజని ఈ ఏరియాలో ఇప్పటికే గట్టు పట్టును సాధించుకోవడం అలాగే పూర్వపు మంత్రి కావడంతో ఈమెకు ఈ అంశాలు కలిసి వచ్చి ఈ ఏరియాలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నట్లు జనాలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: