ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా రాదా అనే చర్చ వైసీపీ అభిమానుల మధ్య జరుగుతున్న సంగతి తెలిసిందే. పెరిగిన పోలింగ్ వైసీపీకి నష్టం కలిగిస్తుందని కొంతమంది భావిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పెరిగిన పోలింగ్ కారణమని తెలుస్తోంది. ఈ లెక్కల ప్రకారం ఏపీలో పెరిగిన పోలింగ్ కూడా వైసీపీకి ఎంతో కలిసొస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ఏపీలో రెడ్డి కులం ఓట్లు అన్నీ వైసీపీకే పడ్డాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. అయితే ఈ కులం ఓట్లతో పాటు ఎస్సీ ఓట్లు కూడా వైసీపీకే పడ్డాయని తెలుస్తోంది. దాదాపుగా 90 శాతం మంది ఎస్సీలు వైసీపీ అమలు చేసిన పథకాలతో సంతృప్తి చెందారని వాళ్ల ఓట్లన్నీ పూర్తి వైసీపీకే పడటం ఆ పార్టీకి ఎంతగానో ప్లస్ కానుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
రెడ్డి, ఎస్సీ, బీసీ కులాల మద్దతు వైసీపీకే ఉండటంతో రాష్ట్రంలో వైసీపీ సులువుగానే అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ సైతం ఈ కులాల ఓట్ల విషయంలో చాలా ఆశలు పెట్టుకోవడంతో ఆ ఆశలు దాదాపుగా నెరవేరినట్టేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. 120 కంటే ఎక్కువ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని తెలుస్తోంది.
 
ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఒకింత ఉత్కంఠ అయితే కొనసాగనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ గెలిచిన తర్వాత నవరత్నాల పథకాలను మరింత మెరుగ్గా అమలు చేసేలా ప్లాన్స్ ఉన్నాయని సమాచారం అందుతోంది. వైసీపీ గెలుపు విషయంలో చూపిస్తున్న కాన్ఫిడెన్స్ చూసి కూటమి నేతలు తెగ టెన్షన్ పడుతుండటం గమనార్హం. రాయలసీమ జిల్లాల విషయంలో వైసీపీ నేతలు పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
 


మరింత సమాచారం తెలుసుకోండి: