వైసిపి అధినేత నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి తన సొంత ఊరు పులివెందులలో పర్యటించడం జరిగింది. దీంతో భారీ ఎత్తున అక్కడికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ఫలితాలు అనంతరం మొన్నటి వరకు పార్టీ నాయకులతో గెలిచిన సభ్యులతో ముఖాముఖిగా మాట్లాడిన వైసిపి పార్టీ అధినేత జగన్ నిన్నటి రోజున తన సొంత నియోజకవర్గం పులివెందులలో అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే మరొకపక్క వైయస్ జగన్ నివాసం పైన కొంతమంది సొంత పార్టీ కార్యకర్తలు నాయకులు ఆందోళన చేసినట్లుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.


ముఖ్యంగా జగన్ ఇంటికి ఉన్నటువంటి అద్దాలను ధ్వంసం చేశారని జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారనే విధంగా వార్తలతే వినిపించడమే కాకుండా పోలీసులు వీరిని అదుపు చేయలేకపోయారని వైరల్ గా మారాయి. తాజాగా ఈ విషయాల పైన వైసిపి సోషల్ మీడియా ఖండించింది. ఈ విషయం పైన క్లారిటీ ఇస్తూ పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనతో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయని ఎల్లో మీడియా ఛానల్ చేస్తున్న ప్రచారాన్ని సైతం ఖండిస్తున్నాం అంటూ జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని పిచ్చి మీడియా పిచ్చి రాతలు మాత్రమే రాస్తుంది. కార్యకర్తలు ఆగ్రహించారని తప్పుడు వార్తలను కూడా ప్రచారం చేస్తున్నారు ఇందులో నిజం లేదంటూ తెలియజేశారు.మానసికంగా రుగ్మ తలతో బాధపడుతున్న కొన్ని మీడియా ఛానల్లు అతిని ప్రజలు గమనిస్తూనే ఉంటారు అంటూ క్లారిటీ ఇచ్చారు. టిడిపి పార్టీకి చెందిన సోషల్ మీడియా నుంచి జగన్ పైన జనం తిరుగుబాటు చేస్తున్నారంటూ ఒక విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముఖ్యంగా జగన్ ఎక్కువగా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారని ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పులివెందులకు వచ్చారు.. ఇప్పుడు మేము గుర్తుకు వచ్చామా అంటూ చాలామంది ప్రజలు వైసిపి నేతలు ఆగ్రహం చేసి జగన్ ఇంటి వద్ద అద్దాలు ధ్వంసం చేశారనే విధంగా వైరల్ గా చేశారు. ఈ విషయాలన్నీ ఫేక్ అంటూ వైసీపీ సోషల్ మీడియా క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: