మాజీ సీఎం వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేసినా ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఎన్నికల సమయంలో కూటమి సర్కార్ ఇచ్చిన దొంగ హామీలే ఆ పార్టీ గెలుపునకు కారణమని జగన్, వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే పాదయాత్ర విషయంలో జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.
 
2027 సంవత్సరంలో పాదయాత్ర చేసే విధంగా జగన్ ప్రణాళికలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే పాదయాత్ర చాలా సందర్భాల్లో ఏపీలో సానుకూల ఫలితాలను ఇచ్చిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. జగన్ రాష్ట్రంలో వైసీపీకి పూర్వ వైభవం తెచ్చే విషయంలో ఎంతమేర సక్సెస్ అవుతుందనే చర్చ సైతం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.
 
జగన్ రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని పార్టీ స్థాయిన్ పెంచాలని ఆయన అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. జగన్ భవిష్యత్తు ప్రణాళికలు సరిగ్గా ఉంటే మాత్రమే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.
 
కార్యకర్తలకు తగినంత ప్రాధాన్యత ఇస్తానని జగన్ ఈ మధ్య కాలంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పార్టీ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న జగన్ సరైన ప్రణాళికలతో ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు
 


మరింత సమాచారం తెలుసుకోండి: