
రేవంత్ రెడ్డి దంపతుల కటౌట్ కాళ్ల దగ్గర... సరస్వతి దేవి ఫోటో చిన్నగా పెట్టి అవమానించారని సోషల్ మీడియాలో గులాబీ పార్టీ నేతలు... ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ మంత్రులు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతుల కాళ్ళ దగ్గర చదువుల తల్లి సరస్వతి తల్లి ఫోటో పెడతారా అంటూ మండిపడుతున్నారు. కాలేశ్వరం బస్టాండ్ దగ్గర సరస్వతి దేవి కటౌట్లు పెట్టి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ మంత్రులకు స్వాగతం పలుకుతూ కొన్ని కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదాస్పద ఫోటో వైరల్ గా మారింది. దీన్ని వెంటనే తీసేయాలని గులాబీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి దేవి పుష్కరాలు ఇవాల్టి నుంచి ఈనెల 26వ తేదీ వరకు కొనసాగుతాయి. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరోసారి జరగబోతున్నాయి. దీంతో కాలేశ్వరం కు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు