
ఇదే మూమెంట్లో కీలకమైన వైఎస్ఆర్ జిల్లా పేరును మారుస్తూ కూటమి ప్రభుత్వం జీవో చారీ చేసింది . దీనితో ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వైసిపికి బిగ్ షాక్ తగిలినట్టు అయింది . ఇప్పటికే చంద్రబాబు క్యాబినెట్ జిల్లా పేరు మార్పుపై నిర్ణయం తీసుకుంది . దీని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నంతవరకు ఈ జిల్లా పేరు కడప గానే ఉండేది . కానీ ఆ తర్వాత కడప అంటే దేవుని గడప అని అర్థం అంటూ వైయస్ మరణం తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాకు వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చింది .
దివంగత ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఆయనకు నివాళిగా అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిపింది. చాలామంది ఈ నిర్ణయం పట్ల సానుకూలంగానే స్పందించారు . రాష్ట్ర విభజన తర్వాత టిడిపి ప్రభుత్వం కూడా ఇదే పేరు కొనసాగించింది . కానీ వైసీపీ అధికారంలోకి రాగానే కడప జిల్లా పేరులో ఉన్న వైయస్ ఆర్ మాత్రమే ఉంచి కడపను తీసేసింది. దీంతో వైసిపి హయాంలో ఇది వైఎస్ఆర్ జిల్లా గానే కొనసాగుతూ వచ్చింది . సెంటిమెంట్ కడప ను జిల్లా పేరులో నుంచి తీసేయడం పట్ల చాలామంది విమర్శలు కూడా చేశారు . అయినా సరే సీఎం జగన్ అవేవి పట్టించుకోలేదు. కాకపోతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్ జిల్లా పేరులో తిరిగి కడపను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టే ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది . కడపలోనే టిడిపి మహానాడు నిర్వహిస్తున్నాడు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే కూటమి సర్కార్ వైయస్సార్ జిల్లా ను వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది . దెబ్బకి జగన్ కి గూబ గుయ్యమనే షాక్ ఇది అంటూ టిడిపి తమ్ముళ్లు సంబరపడుతున్నారు..!