తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం.. కల్వకుంట్ల కవిత చుట్టే రాజకీయాలు కొనసాగుతున్నాయి. కల్వకుంట్ల కవిత కారణంగా గులాబీ పార్టీకి ఒరిగిందేమీ లేదు కానీ.. ఆమె వల్ల డ్యామేజ్ అవుతోందని చర్చ జోరుగా సాగుతోంది. అప్పట్లో లిక్కర్ స్కామ్ లో అడ్డంగా బుక్ అయిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు... సొంత పార్టీకే విలన్ గా మారింది. గులాబీ పార్టీలో ఉన్న లొసుగులను బహిర్గతం చేసి... రచ్చ లేపింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై మంచి ఊపులో ఉన్న గులాబీ పార్టీ.. జోరును ఒక్క లేఖతో కట్టడి చేసింది.

 కల్వకుంట్ల కవిత లేఖతో గులాబీ పార్టీ పూర్తిగా పడిపోయింది. ఇదే అదునుగా చేసుకొని..కాంగ్రెస్ అలాగే బిజెపి పార్టీలు... గులాబీ పార్టీ ని మరింత బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే సందెట్లో సడే మియా లాగా... ఏబీఎన్ ఆర్కే దూరేశాడు. ప్రతి దాంట్లో వేలు పెట్టే ఏబీఎన్ ఆర్కే... కెసిఆర్ కుటుంబంలో గొడవలు అంటే... చంకలు గుద్దుకోవడం గ్యారంటీ.  

 వెంటనే రెండు కథనాలు ప్రత్యేకంగా రాసేశాడు.  కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోతున్నారని... ప్రత్యేక కథనం రాసి... గులాబీ పార్టీని మరింత డిలాపడేలా చేశారు. ఒకవేళ కాంగ్రెస్ నేతలు కాదంటే ప్రత్యేక కుంపటి పెట్టుకుంటుందని... కల్వకుంట్ల కవిత పై బాంబు పేల్చాడు. దీంతో ఆంధ్రజ్యోతి కథనం ఇవాళ ఉదయం నుంచి వైరల్ గా మారింది. అయితే కాసేపటికి క్రితమే ఈ కథనంపై కల్వకుంట్ల కవిత చాలా ఘాటుగా స్పందించారు.


 కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రిక ది  జర్నలిజమా? లేక శాడిజమా ? అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు కల్వకుంట్ల కవిత. అనవసరంగా తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారని... ఏబీఎన్ కు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో... తనపై వచ్చిన కథనాలన్నీ పూర్తిగా అవాస్తవం అంటూ... కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు. తాను గులాబీ పార్టీలో ఉంటానని... కెసిఆర్ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పకనే చెప్పారు. దీంతో ఈ ఎపిసోడ్కు ఇక్కడితో ముగింపు పలుకుతుందా? సీరియల్ ఎపిసోడ్ లాగా కొనసాగుతుందా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: