
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ మహానాడు వేదికగా సీమ ప్రజలకు ప్రశ్నలు సంధించగా ఆ ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. . తల్లిని చెల్లిని గెంటేసింది ఎవరంటూ నారా లోకేశ్ ప్రజలను ప్రశ్నించారు. సొంత బాబాయ్ ని లేపేసింది ఎవరంటూ లోకేశ్ కామెంట్ చేశారు. జే బ్రాండ్స్ అమ్మి పేదల రక్తం తాగింది ఎవరని చెప్పుకొచ్చారు. బల్ల కింద ఎర్ర బటన్ నొక్కి ప్రజల్ని బాదింది ఎవరంటూ కామెంట్ చేశారు.
అందరూ ఎర్ర బుక్ ఎర్ర బుక్ అని ఏడుస్తున్నారని ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పానని లోకేశ్ అన్నారు. ఎర్ర బుక్ అంటే గజగజా వణికిపోతున్నారని లోకేశ్ పేర్కొన్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని లోకేశ్ వెల్లడించారు. గత పాలకులు బాబుని బంధించామని సంబరపడ్డారని లోకేశ్ అన్నారు.
కానీ వాళ్లే పార్టీ ఆఫీస్ కు టూ లెట్ బోర్డ్ పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు. రెడ్ బుక్ పేరు వింటే ఒకరు గుండె పోటుతో మరొకరు బాత్ రూమ్ లో పడిపోయారని లోకేశ్ చెప్పుకొచ్చారు. నాన్నను జైలులో కలిసినప్పుడు చాలా బాధేసిందని లోకేశ్ కామెంట్లు చేశారు. నాన్న ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించారని ఆయన వెల్లడించారు. తెలుగు ప్రజలు బాబు వెనుక నిలబడాలని దేవుడు పరీక్షలు పెట్టాడని లోకేశ్ పేర్కొన్నారు.
కడపలో పసుపు పండగ నిర్వహించడం అదృష్టం అని లోకేశ్ వెల్లడించారు. చందబాబు ట్రెండ్ ఫాలో అవ్వరని ట్రెండ్ సెట్ చేస్తారని లోకేశ్ వెల్లడించారు. వై నాట్ 175 అన్నవాళ్లకు ప్రతిపక్షం కూడా లేకుండా పోయిందని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్ అంటే మూడక్షరాలు కాదని ఎన్టీఆర్ అంటే ప్రభంజనం అని నారా లోకేశ్ పేర్కొన్నారు. దేశానికి ఎన్టీఆర్ సంక్షేమాన్ని పరిచయం చేశారని చెప్పుకొచ్చారు.