రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేతలైన జగన్, కేసీఆర్ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే. జగన్, కేసీఆర్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు సైతం చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే జగన్ పై కేసీఆర్ అభిమానం వెనుక అసలు కథ వేరే ఉందని తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వైఎస్సార్ సీఎంగా ఉన్నంత కాలం రాష్ట్రం విడిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
 
అయితే కేసీఆర్ కు మాత్రం పలు సందర్భాల్లో వైఎస్సార్ అండగా నిలిచారనే సంగతి తెలిసిందే. జగన్ సైతం 2014 ఎన్నికల్లో వైసీపీ తెలంగాణలో పలు స్థానాల్లో గెలిచినా అక్కడ రాజకీయాలు చేయడానికి ఇష్టపడలేదు. ఈ రీజన్ వల్లే జగన్ అంటే కేసీఆర్ కు ప్రత్యేకమైన అభిమానమని సమాచారం అందుతోంది. జగన్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పార్టీ మళ్లీ పుంజుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
 
కూటమి ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందువల్ల 2029లో తమ పార్టీ సులువుగానే అధికారంలోకి వస్తుందని జగన్ భావిస్తున్నారు. జగన్ అమలు చేసిన స్థాయిలో కూటమి సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదనే సంగతి తెలిసిందే. కూటమి నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండగా జగన్ కు మాత్రం ప్రజలు నీరాజనం పలుకుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
 
కూటమి పాలన రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది. చంద్రబాబు నాయుడు మాటలకు చేతలకు ఏ మాత్రం పొంతన లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమి ఎన్నికలకు ముందు ఎక్కువ సంఖ్యలో హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తే మాత్రమే ఈ పార్టీకి ప్లస్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపునకు సంబంధించి జగన్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: