అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా, ఆయన విజయానికి తెరవెనుక సూత్రధారిగా భావించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇప్పుడు ఎదురుతిరిగారు. ఏకంగా ట్రంప్ వర్గానికి చెందిన స్పీకర్‌కే అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు నిరాకరించి, రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించారు.

కేవలం రాజకీయంగా దూరం జరగడమే కాదు, అమెరికా భవిష్యత్తుపై మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్గి రాజేస్తున్నాయి. అగ్రరాజ్యం అతిపెద్ద ఆర్థిక సంక్షోభం అంచున ఉందని, మూడు ట్రిలియన్ డాలర్ల అప్పుల సుడిగుండంలో చిక్కుకుందని మస్క్ బాంబు పేల్చారు. నిన్నటికి నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు అమెరికన్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. దేశ సంపాదనలో నాలుగో వంతు, అంటే ఏకంగా 25 శాతం కేవలం అప్పులకు వడ్డీలు కట్టడానికే పోతోందని తేల్చిచెప్పారు. ఇక జీతాలు, ఇతర ఖర్చులు కలుపుకుంటే 60 నుంచి 70 శాతం ఆవిరైపోతుంటే, సామాన్య ప్రజల చేతికి మిగిలేది ఏమీ లేదని కుండబద్దలు కొట్టారు.

ఈ ఆర్థిక సంక్షోభ భయాల నేపథ్యంలోనే, ట్రంప్ తరఫున మద్దతు కూడగట్టేందుకు, ఆయన్ను బుజ్జగించేందుకు అమెరికా స్పీకర్ రంగంలోకి దిగారు. ఎలాన్ మస్క్‌తో భేటీకి ప్రయత్నించగా, ఆయన నుంచి ఊహించని సమాధానం వచ్చింది. 'రమ్మంటే రాను పొమ్మ'న్నట్లుగా స్పీకర్ పిలుపును మస్క్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ట్రంప్ శిబిరానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది.

ఒకప్పుడు ట్రంప్ గెలుపు కోసం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను సైతం వాడారన్న ఆరోపణలు ఎదుర్కొన్న మస్క్, ఇప్పుడు అదే ట్రంప్‌కు వ్యతిరేకంగా గళం విప్పడం, ఆయన వర్గానికి ముఖం చాటేయడం చూస్తుంటే, అమెరికా రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయని స్పష్టమవుతోంది. మస్క్ హెచ్చరికలు నిజమైతే అమెరికా భవిష్యత్తు ఏమిటన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఏదేమైనా ఈ పరిణామాలను యూఎస్ తో పాటు మిగతా దేశాలు ప్రజలు కూడా అసలు ఊహించలేదు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: